Royal Enfield : మార్కెట్లోకి కొత్తగా ఏదన్నా వాహనం వస్తోందంటే, దాదాపుగా అది ఎలక్ట్రిక్ వాహనమే.. అనేంతలా జనం ఫిక్సయిపోయారు. ఎందుకంటే, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల మయం కాబోతోంది.
సంప్రదాయ ఇంధన వనరుల కొరత, కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా ప్రభుత్వాలు వాహన కంపెనీల్ని, వాహన వినియోగదారుల్నీ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వచ్చేయనుందిట. బీహార్‌కి సంబంధించిన ఓ సంస్థ సిల్వెలైన్ తన వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లా కనిపించే ఓ ఎలక్ట్రిక్ బైక్‌ని విక్రయిస్తోంది. అయితే, ఈ బైక్ పేరుని లవ్ ప్లస్‌గా పేర్కొంటున్నారు. అచ్చంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌లానే కనిపిస్తోంది.
రేటు కూడా బాగానే వుందే..
లక్షన్నర రూపాయలకు ఈ బైక్ లభిస్తుందట. అంటే, రేటు తక్కువే. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ గనుక ఎలక్ట్రిక్ బైక్ దించితే, దాని రేటు రెండున్నర లక్షల పైనే వుండొచ్చేమోనని అంతా అంచనా వేస్తున్నారు.
కాగా, లవ్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ కావాలంటే కేవలం 2 వేల రూపాయలతో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునట. ఎరుపు, నలుపు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
చాలా సౌకర్యవంతమైన రైడ్ ఈ లవ్ ప్లస్ సొంతమని తయారీదారులు చెబుతున్నారు. మరోపక్క, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఈ బైక్ విషయమై గుస్సా అవుతోందిట
0 Comments:
Post a Comment