దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటే ఈ నదుల సొగసులను చూడండి. వాటి అందాలు మీ మదిలో ఎల్లప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు దేశంలోని ఐదు అత్యంత సుందరమైన నదుల గురించి తెలుసుకుందాం.
రైలు లేదా బస్సు ప్రయాణంలో ఈ నదులు కనిపించినప్పటికీ వాటిని నేరుగా చూడటం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది.
అలాంటి నదులలో బ్రహ్మపుత్ర నది ఒకటి. ఇది ఎంతో విశాల పరీవాహక ప్రాంతాన్ని కలిగివుంది. దేశంలో పురుష పేరుతో ఉన్న నది ఇదొక్కటే కావడం విశేషం.
ఈ నది టిబెట్‌లోని మానససరోవరంలో ఉద్భవించింది. ఉగ్మోట్ నది కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది దేశంలోని స్వచ్ఛమైన నదులలో ఒకటిగా నిలిచింది.
ఈ నదిలోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే... నది లోతులు కూడా మనకు స్వచ్ఛంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ నది ఉగ్రరూపం దాలుస్తుంటుంది. ఈ నది మేఘాలయలో ఉంది.
సింధు నది నాగరికతతో ముడిపడివుంది. ఈ నది భారత్, పాకిస్తాన్, చైనా... ఈ మూడు దేశాలలోనూ కనిపిస్తుంది. జూన్ నుంచి అక్టోబరు వరకూ ఈ నదిని సందర్శించేందుకు అత్యుత్తమ కాలం.
గంగా నదిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. హిమాచల్‌లో ఈ నది ఉద్భవించింది. రిషికేష్, హరిద్వార్, వారణాసిలలో ఈ నది హొయలు చూడవచ్చు.
చంబల్ నది ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. ఈ నది నీటిని ఎవరూ తాగలేరని ద్రౌపది శాపమిచ్చిందని చెబుతారు.
0 Comments:
Post a Comment