Reheat Food: మనం ఉదయం వేడిగా వండుకున్న ఆహారాన్ని తింటుంటాం. మిగిలితే మళ్లీ సాయంకాలం కూడా దాన్ని వేడి చేసుకుని తింటాం. ఇలా చేస్తే ఆహార పదార్థాలు విషంగా మారతాయి.
నిజానికి ఒకసారి వేడి చేసిన వాటిని మళ్లీ వేడి చేసుకుని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. దీంతో అందులో హానికారక బ్యాక్టీరియా పెరుగుతుంది.
అలా చేస్తే ఆహారం విషతుల్యంగా అవుతుంది. కొందరైతే మైక్రో వేవ్ లో పెట్టి మరీ తింటుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
ఇలా చేస్తే కడుపులో గ్యాస్, కలత, ఫుడ్ పాయిజనింగ్, ఆహారం ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు దరిచేరడం ఖాయం. ఒకసారి వండిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడం కంటే దాన్ని పడేయడం ఉత్తమం.
Reheat Food
మనకు పోషకాలు అందించే ఆహారాల్లో కోడి గుడ్డు ఒకటి. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఎంతో లాభం ఉందని గుర్తించి వాటిని పొద్దున తిన్నాక మిగిలితే సాయంత్రం ఓవెన్ లో పెట్టుకుని వేడి చేసుకుని మరీ తినడం చేస్తుంటారు. గుడ్లను మళ్లీ వేడి చేయడం అంత సురక్షితం కాదు.
ఇలా చేయడం వల్ల అందులో ఉండే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పెరిగి మనకు విషంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అందుకే వేడి చేయకుండా అలాగే తినడం సురక్షితం. మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే అనర్థాలను గుర్తుంచుకుని వేడి చేయడాన్ని మానుకోవడమే మంచిది.
అత్యధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారాల్లో బంగాళాదుంప ఒకటి. దీన్ని మితంగా తింటేనే ప్రయోజనం. అధికంగా తీసుకుంటే నష్టమే.
బంగాళాదుంప కూరను కూడా మరోమారు వేడి చేయడం వల్ల అందులో ఉండే సి బోటులినమ్ బాగా పెరుగుతుంది.
ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది. మనలో చాలా మంది రాత్రి మిగిలిపోయిన చికెన్ ను పొద్దున వేడి చేసుకుని తింటారు. ఇది కూడా డేంజరే. వేడి చేయడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి.
దీంతో చికెన్ లో ఉండే ప్రొటీన్లు విషంగా మారుతాయని పరిశోధనలు వెల్లడించాయి. అందుకే ఉదయం వండిన వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల మనకు ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి.
Reheat Food
అన్నాన్ని సాక్షాత్తు అన్నపూర్ణ దేవితో పోలుస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. అన్నాన్నికూడా వేడి చేసుకుని తింటారు. ఇది కూడా కరెక్టు కాదు. అన్నాన్ని వేడి చేసి తినకూడదు.
దీంతో వ్యాధికారక బ్యాక్టీరియా ఎక్కువై మనకు రోగాలు వస్తాయి. మైక్రోవేవ్ లో అసలు పెట్టకూడదు. సీ ఫుడ్ ను కూడా మరోసారి వేడి చేస్తే నష్టమే. అలా చేయడం వల్ల చెడు బ్యాక్టీరియా పెరిగి కడుపుకు హాని చేస్తాయి.
సీఫు్డ్ ను ఫ్రిజ్ లో ఉంచకుండా జాగ్రత్త వహించాలి. దీంతో మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు కూడా వండిన వాటిని మళ్లీ వేడి చేయడం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి.
0 Comments:
Post a Comment