Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చక్కటి చిట్కా ఇదే.. దీంతో బరువు కూడా తగ్గుతారు..!
How To Reduce Belly Fat: మనలో చాలా మంది బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే శరీర బరువు తగ్గించుకోవడానికి.. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా చాలా మంది కఠినతర వ్యాయామాలే కాకుండా వివిధ రకాల డైట్స్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన శరీర బరువును తగ్గించుకోలేకపోతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గసగసాలలో బెల్లీ ఫ్యాట్ చెక్:
గసగసాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని సులభంగా అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, పిండి పదార్థాలు, కాల్షియం, ఫైబర్, మాంగనీస్‌లు కూడా లభిస్తాయి.
1. గసగసాలతో ఇలా చేయండి:
గసగసాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి శరీర బరువు తగ్గిండానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఈ గసగసాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వినియోగిస్తే బరువు తగ్గడమేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి.
2. గసగసాల సిరప్:
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఆరోగ్యకరమైన సిరప్స్ లభిస్తున్నాయి. అందులో భాగంగానే గసగసాల సిరప్‌లు కూడా విక్రయిస్తున్నారు. అయితే ఈ సిరప్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పెరుగుతున్న బరువు తగ్గడం కీలక పాత్ర పోషిస్తుంది.
3. పాలతో గసగసాలు:
పాలలో గసగసాలు కలుపుకుని తాగడం వల్ల కండరాలు, ఎముకలకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టు పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ గోరువెచ్చని పాలలో వీటిని వేసుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
0 Comments:
Post a Comment