Rajani kanth - రజనీకాంత్ జీవితాన్ని మార్చిన అమ్మాయి.. ఇప్పటికి ఆమె కోసం ఎదురుచూపులు!
రజనీకాంత్.. దక్షిణాదిలోనే కాక.. దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు.
బస్ కండక్టర్‌గా జీవితం ప్రాంరభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా రాణిస్తూ.. నేడు సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. విదేశాల్లో కూడా రజనీకాంత్‌కు అభిమానులున్నారంటే.. ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. వాస్తవ జీవితంలో.. ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏడు పదుల వయసులో కూడా.. కుర్ర హీరోలకు ధీటుగా.. వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు రజనీకాంత్. రాజకీయాల్లో కూడా ప్రవేశించాలని భావించారు. కానీ ఆదిలోనే ఆ ప్రయత్నాలను మానుకున్నారు. ఇక రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు.
మరి నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజనీకాంత్.. ఒకప్పుడు బస్ కండక్టర్ అనే విషయం అందరికి తెలుసు. మరి కండక్టర్‌గా ఉన్న మనిషి.. సినిమాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నాడు.. ఎవరి ప్రొద్భలంతో.. ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు అంటే.. అందుకు కారణం ఓ మహిళ. రజనీకాంత్ కండెక్టర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే.. ఆయనలోని ప్రతిభను గుర్తించిన ఓ యువతి.. ఆయనకు తెలియకుండా.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు అప్లై చేయడం.. అక్కడి నుంచి లేటర్ రావడం జరిగింది. కానీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందకు కూడా రజనీకాంత్ చేతిలో రూపాయి లేదు. అప్పుడు ఆ అమ్మాయే.. 500 రూపాయలు ఇచ్చి.. ఆయన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు కారణం అయ్యారు. ఆ తర్వాత రజనీకాంత్.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆయన జీవితంలో ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం.. ఆ యువతి. ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం కోసం.. రజనీకాంత్.. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారట. ఆ వివరాలు..
రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు.. బెంగళూరులో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదివే ఒకమ్మాయి.. తరచుగా రజనీకాంత్.. డ్యూటీ చేసే బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేది. అలా వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక ఆ సమయంలో రజనీకాంత్.. నాటకాలు వేసేవాడు. ఈ క్రమంలో ఓ రోజు.. తను నటించే ఒక నాటకానికి ఆ అమ్మాయిని రజనీ ఆహ్వానించాడు.
ఆ సంఘటన తర్వాత కొన్ని రోజులకు రజనీకి చెన్నైలోని అడయార్ ఇన్‌స్టిట్యూట్‌కు రావాల్సిందిగా ఒక లెటర్ వచ్చింది. ఇదేంటి.. తనేం అప్లై చేయలేదు.. మరి ఈ లెటర్ రావడం ఏంటి అనుకున్నారు. తనకు తెలియకుండా ఎవరు అప్లై చేశారా అని రజనీ ఆలోచించసాగారు. ఇక బస్‌లో వెళ్తుండగా.. అమ్మాయి లెటర్ వచ్చిందా అని రజనీని అడిగిందట. ఆయన ఆశ్చర్యపోయి.. నువ్వే అప్లై చేశావా అని అడిగితే.. ఆమె అవునని చెప్పింది. మరి వెళ్లి జాయిన్ అవ్వు అని ఆమె అంటే.. అప్పుడు రజనీకాంత్.. 'వెళ్లవచ్చు. కానీ అక్కడ ఉండటానికి, ఖర్చులకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అంత డబ్బులు నా దగ్గర లేవు' అన్నారట.
అప్పుడు ఆ అమ్మాయి వెంటనే.. తన దగ్గరున్న రూ.500 ఇచ్చి.. రజనీ చేతిలోపెట్టి.. 'నీకు ఎంతో ప్రతిభ ఉంది. నీ టాలెంట్‌కి నువ్వు యాక్టింగ్‌లో ఎంతో ఎత్తుకు ఎదగగలవు. ప్రపంచంలోనే గొప్ప నటుడివయ్యే సత్తా నీలో ఉంది. నీ పోస్టర్లు, కటౌట్లను నేను ఇక్కడ చూడాలి. నువ్వు కచ్చితంగా వెళ్లాల్సిందే' అని పట్టుబట్టి.. మరి రజనీకాంత్‌ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపిందట. ఇక రజనీ.. చెన్నై వచ్చాక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాక.. దాని నిర్వాహాకులు.. వెంటనే జాయిన్ అవ్వమని అడిగారట. అక్కడ జాయిన్ అయిన తర్వాతి ఆదివారం రజనీకాంత్ ఆ అమ్మాయిని చూడటానికి బెంగళూరు వచ్చారు. కానీ ఆరోజు ఆ అమ్మాయి బస్ ఎక్కలేదు. తర్వాతి రోజు కూడా వచ్చి వెయిట్ చేసినా ఆ అమ్మాయి కనిపించలేదు.
దీంతో రజనీ కొంతమంది ఫ్రెండ్స్‌ని వెంటబెట్టుకుని బెంగళూరులో ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించి ఇంటికి వెళ్లి చూడగా.. తాళం వేసి కనిపించింది. పక్కింటి వాళ్లని అడిగితే వారం క్రితమే ఆ అమ్మాయి ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారట. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు రజనీకాంత్‌కి ఆ అమ్మాయి కనిపించలేదట. కానీ ఆ అమ్మాయి చెప్పినట్లే రజనీ.. ఆ తర్వాత దేశం గర్వపడే హీరో అయ్యారు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీ ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి రజనీ కోసం రాలేదట.
ఈ విషయం తనను ఇప్పటికి బాధిస్తుంది అని.. ఇప్పటికీ ఈ ప్రపంచంలో తాను ఏ మూలకి వెళ్లినా తన కళ్లు ఆ అమ్మాయి కోసం వెతుకుతాయని రజనీనే స్వయంగా చెప్పారు. తన స్టార్‌డం కంటే కూడా.. నాడు తనలోని ప్రతిభను గుర్తించి.. నమ్మి.. ప్రోత్సాహించిన ఆ అమ్మాయి మంచితనం గొప్పదని చాలా సందర్భాల్లో అన్నారు. తాను సూపర్ స్టార్ అయ్యాను కాబట్టి.. ఆ అమ్మాయి తన దగ్గరకు రాలేదని, అదే ఆ అమ్మాయి గొప్పతనం అన్నారు రజనీకాంత్.
తాజాగా ఈ విషయాలన్నీ ప్రముఖ మలయాళ నటుడు దేవన్ శ్రీనివాసన్ వెల్లడించారు. ఈయన ఎవరు అంటే.. బాషా సినిమాలో నగ్మా తండ్రిగా నటించింది ఇతడే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే.. రజనీ.. తన స్టోరిని దేవన్‌కు చెప్పారట. మొత్తం చెప్పాక రజనీ విపరీతంగా ఎమోషనల్ అయ్యారని దేవన్ గుర్తు చేసుకున్నాడు. రజనీని అలా చూసిన దేవన్.. ఆయనను ఓదార్చాడినికి 'సార్. ఆవిడ ఏదో ఒకరోజు మీకు కనిపిస్తుంది'' అని చెప్పారట. అప్పుడు రజనీ 'కచ్చితంగా వస్తుందంటావా' అని చాలా ఆత్రుతగా అడిగారట. ఇక తాను విన్న, చూసిన ప్రేమకథల్లో ఇదే అత్యంత గొప్పదని దేవన్ అన్నారు. మరి రజనీని అంతలా ప్రోత్సాహించిన ఆ అమ్మాయి.. ఆయన హీరో అయ్యాక ఒక్కసారి కూడా కనిపించలేదంటే.. ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో కదా. మరి ఎప్పిటికైనా.. ఆమె రజనీకాంత్‌కు కనిపిస్తుందా లేదా..
0 Comments:
Post a Comment