Rains: దక్షిణకోస్తా, రాయలసీమకు వర్షసూచన...
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం (low pressure) పశ్చిమ దిశగా పయనించి ఆదివారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ప్రవేశించింది.
దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా రానున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 20వ తేదీ నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా అల్పపీడనం ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తూర్పుగాలులతో ఆదివారం దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమ (Rayalaseema)లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగింది. ఆదివారం కడపలో 18.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.
0 Comments:
Post a Comment