Pudina juice -పూదీన జ్యూస్ ని లైట్ తీసుకోవద్దు.. అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసా!
కొత్తిమీర తో పోల్చితే పూదీనా వినియోగం చాలా తక్కువ ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే పుదీనా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనా ఎన్నో ఆయుర్వేదిక్ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. పుదీనా వాసన చాలా మంది ఇష్టపడుతారు. అందుకే ఆయుర్వేద ఔషదాల్లో పూదీనాను ఎక్కువగా వినియోగిస్తారనే టాక్ ఉంది. పూదీనా అనేక రకాల అనారోగ్య సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యల వరకు కూడా పూదీనా పరిష్కార మార్గం చూపిస్తుంది.
వేసవి కాలంలో రోడ్డు పై ఉండే పుదీనా జ్యూస్ ని కొద్ది మంది మాత్రమే తాగుతూ ఉంటారు. కానీ పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరు కూడా వద్దనరు. పుదీనా వల్ల ప్రధానంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అజీర్తి మరియు మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ అసిడిటీ అన్ని కూడా తగ్గి పోతాయి. పుదీనా ఆకులు ప్రతి రోజు ప్రతి రోజు తీసుకున్న వారిలో అజీర్తి సమస్య శాశ్వతంగా పోయింది అంటున్నారు. జలుబు తో బాధపడుతున్న వారు తక్షణ ఉపశమనం కోసం రెండు టీ స్ఫూన్ ల పూదీనా రసంను తాగాలి. అలా చేసిన కొన్ని గంటల్లోనే శ్వాస సంబంధిత సమస్య తగ్గి పోయి జలుబు కనిపించకుండా పోతుంది.
వాంతులు వికారం తో బాధపడుతున్న వారు పుదీనా ఆకుల రసం ను తాగడం వల్ల వెంటనే ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రయాణా ల సమయంలో వాంతులు మరియు వికారం అనిపించే వారు తమ చెంత పుదీనా ఆకులు తీసుకోవాలి. జర్నీ సమయంలో ఒక్కో ఆకు చొప్పున నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం రావడం పళ్ళు పుచ్చి పోవడం వంటి సమస్యలు పుదీనా జ్యూస్ తాగడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంది. మెదడు చురుకుగా పని చేసేందుకు కూడా పూదీనా జ్యూస్ బాగా పని చేస్తుందని అంటున్నారు. చర్మ సమస్యలు కూడా పుదీనా జ్యూస్ వల్ల తగ్గి పోతాయి. కనుక రోడ్డు మీద పోయేప్పుడు ఇకపై ఎక్కడ పూదీన జ్యూస్ కనిపించినా కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా తాగండి.
0 Comments:
Post a Comment