Pralay Missiles : సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత సాయుధ బలగాల కోసం సుమారు 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను(Pralay Missiles) కొనుగోలు చేసేందుకు రక్షణమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం, ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు 150 నుండి 500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగలవు. ఇంటర్‌సెప్టర్ క్షిపణుల ద్వారా శత్రువులు వీటిని అడ్డుకోవడం చాలా కష్టం..ఈ క్షిపణులను చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు సమాచారం.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించిన ఈ క్షిపణిని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2015 నుంచి మిస్సైల్ సిస్టమ్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్నది. దివంగత ఆర్మీ చీఫ్ స్టాప్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వీటిని ప్రోత్సహించారు.
గతేడాది డిసెంబర్ 21, డిసెంబర్ 22 తేదీల్లో వరుసగా రెండుసార్లు ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ప్రళయ్ అనేది ఒక పాక్షిక బాలిస్టిక్ ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి.
ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఓడించగలిగే విధంగా ఈ అధునాతన క్షిపణినిని అభివృద్ధి చేశారు. ఇది గాలిలో ఒక నిర్దిష్ట పరిధిని కవర్ చేసిన తర్వాత దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రళయ్.. ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు, ఇతర కొత్త సాంకేతికతలతో ఆధారితమైనది.
క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి. ఈ క్షిపణిని మొదట భారత వైమానిక దళంలో చేర్చవచ్చు, తర్వాత భారత సైన్యంలో ఉంటుంది.
0 Comments:
Post a Comment