ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, జంతు జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే.
అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇప్పుడు ఈ నిర్ణయంలో కొన్ని మార్పులు చేస్తూ జీవో అప్డేట్ చేసింది. గతంలో ప్రవేశపెట్టిన నిబంధనల్ని కొద్దిగా మార్చింది.
ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేదాజ్ఞలు పాటించనివారిపై జరిమానా విధించాలని ఆదేశించింది.
అదే విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీదారులు, పంపిణీదారులపై సైతం పెనాల్టీ విధించాలని స్పష్టం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పంపిణీపై పెనాల్టీ ఇలా
1. మొదటి తప్పుకు 25 వేల జరిమానాతో పాటు సీజ్ చేసిన వస్తువులపై కేజీకు పది రూపాయలు పెనాల్టీ
2. రెండవ తప్పుకు 50 వేల జరిమానా, సీజ్ చేసిన వస్తువులపై కేజీకు 20 రూపాయలు జరిమానా, పర్యావరణ చట్టం కింద కేసులు నమోదు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీదారులపై పెనాల్టీ
1. మొదటి తప్పుకు 50 వేల జరిమానా, ప్లాస్టిక్ వస్తువుల సీజ్
2. రెండో తప్పుకు లక్ష రూపాయలు జరిమానా, రిజిస్ట్రేషన్ రద్దు, వస్తువులు-యంత్రాల సీజ్, పర్యావరణ చట్టం కింద కేసు నమోదు
జరిమానాలు విధించడమే కాకుండా ప్రభుత్వ ఆదేశాలు శానిటరీ, వార్డ్ సిబ్బందికి తెలిసేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
కమీషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మానిటరింగ్ షెడ్యూల్ వినియోగించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
0 Comments:
Post a Comment