PF Withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!
PF News | మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?
అయితే గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తాజాగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీని వల్ల ప్రావిడెంట్ ఫండ్ కలిగిన వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. పీఎఫ్ విత్‌డ్రాయెల్ సమస్యలు తీరనున్నాయి.
పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు చాలా మంది పీఎఫ్ మనీ విత్‌డ్రా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. పీఎఫ్ డబ్బుల కోసం అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ కావొచ్చు. ఇలా పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈపీఎఫ్‌వో కొత్త నిబంధలను జారీ చేసింది.
పీఎఫ్ క్లెయిమ్ ఎక్కువ సార్లు రిజెక్ట్ అవుతూ ఉంటే.. అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిర్ణీత పరిమితి దాటిన తర్వాత కూడా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కాకుండా పెండింగ్‌లో ఉన్నా కూడా అలాంటి సమస్యలను కూడా ప్రత్యేకంగా పరిష్కరించాలని పేర్కొంది.
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఈ మేరకు కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈపీఎఫ్‌వో ఫీల్డ్ ఆఫీస్‌ల నుంచి చాలా సార్లు పీఎఫ్ క్లెయిమ్స్ తిరస్కరణకు గురి అవుతున్నాయని, అలాగే నిర్దేశించిన కాల వ్యవధిలో సేవలు అందించడం లేదని పీఎఫ్ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతేకాకుండా కొన్ని ఫీల్డ్ ఆఫీస్‌లలో పీఎఫ్ క్లెయిమ్స్‌లో అనుకోని విధంగా ఆలస్యం అవుతోందని, వేధింపులు చోటుచేసుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అనవసరమైన డాక్యుమెంట్ల కోసం కాల్స్ కూడా చేస్తున్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇలాంటి అన్యాయమైన విధానానలు అడ్డుకునేందుకు ఓఐసీలు కచ్చితంగా వారికి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి క్లెయిమ్‌ను పూర్తిగా పరిశీలించాలని సూచించింది.
క్లెయిమ్ రిజెక్ట్ చేసేటప్పుడు అందుకు సంబంధించిన కారణాలను పూర్తిగా తొలి ప్రయత్నంలోనే తెలియజేయాలని పేర్కొంది. క్లెయిమ్ రిజెక్ట్ చేసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారుడు ఆ సమస్యను పరిష్కరించి మళ్లీ క్లెయిమ్ చేసుకుంటే ఇప్పుడు మరో కారణం చెబుతూ క్లెయిమ్‌ను తిరస్కరించే విధానికి స్వస్తి చెప్పాలని వివరించింది. ఇలా జరగకుండా తొలిసారి క్లెయిమ్ రిజెక్ట్ చేసేటప్పుడే అన్ని కారణాలను తెలియజేయాలని పేర్కొంది.
పీఎఫ్ క్లెయిమ్ చాలా సార్లు రిజక్ట్ అయితే అందుకు ఆర్‌పీఎఫ్‌సీ 2, ఏపీఈఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి నెలా రిజెక్ట్ అయిన క్లెయిమ్స్‌లో 50 లేదా ఒక శాతాన్ని ఆర్‌పీఎఫ్‌సీ 1 లేదా ఓఐసీ చెక్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రిపోర్ట్‌ను సంబంధిత జోనల్ ఆఫీస్‌కు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
ఐఎస్ డివిజన్ కూడా ఎక్కువ సార్లు రిజెక్ట్ అయిన పీఎఫ్ క్లెయిమ్స్ రిపోర్ట్‌ను జోనల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుందని తెలిపింది. జోనల్ ఆఫీస్‌లు రీజినల్ ఆఫీస్, ఐఎస్ డివిజిన్ నుంచి వచ్చిన రెండు నివేదికలను చెక్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత, మళ్లీ పీఎఫ్ ఖాతాదారుల నుంచి మళ్లీ క్లెయిమ్ వస్తే.. అలాంటి క్లెయిమ్స్ మళ్లీ పెండింగ్‌లో లేవని, తిరస్కరణకు గురి కాలేదని తెలియజేయడానికి ఫీల్డ్ ఆఫీసుల్లో ఇలంటి క్లెయిమ్స్‌కు ఒక ఫ్లాగ్ కనిపించాలని సూచించింది.
0 Comments:
Post a Comment