Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు..
7th Pay Commission Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ ద్వారా కొత్త రూల్స్ జారీ అయ్యాయి.
పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్‌ను ఒక్కసారి మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ నియమాలపై ఓ లుక్కేయండి.
పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ (DoPPW) నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఎవరైనా ఉద్యోగి తన ప్రాథమిక జీతంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటే.. అతను మళ్లీ పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ (కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్) రూల్స్-1981 ప్రకారం.. ప్రభుత్వం ఒకటి కంటే ఎక్కువసార్లు పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. దీంతో మొత్తం పెన్షన్‌లో 40 శాతం మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఏకమొత్తం ఉపసంహరణపై ఒకేసారి 40 శాతం మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా ఉద్యోగికి సంబంధించి పెన్షన్ సవరిస్తే.. బకాయిలను ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వం ఇక్కడ 40 శాతం నిబంధనను అమలు చేసినా.. జనవరి 1, 2016, ఆగస్టు 4, 2016 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, CCS రూల్ 10 ప్రకారం పెన్షన్ రివిజన్‌పై అదనపు మినహాయింపు పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ నిబంధనలను నియమాలు ఇప్పటి నుంచే వర్తించనున్నాయి.
0 Comments:
Post a Comment