Pancha kharma - పంచకర్మ చికిత్స ఎందుకు చేస్తారు..?
ఆయుర్వేదం ప్రకారం పంచకర్మ చికిత్స ను అనుభవజ్ఞులైన వైద్యులు అందిస్తారు. హిమాలయాల్లో లభించే మూలికలతో కాలుష్య రహిత వాతావరణంలో ఈ చికిత్సలను అందిస్తారు.
అసలు పంచకర్మ అంటే ఏమిటి?
పంచకర్మ అనే పేరు రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది. పంచ, అంటే "ఐదు" అని అర్థం. కర్మ అంటే "చర్య" లేదా విధానం అని అర్థం. పంచకర్మ చికిత్సలో అనేక మూలకాలను ఉపయోగిస్తారు. శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించే ఐదు ప్రాథమిక విధానాలనే పంచ కర్మ చర్యలు అంటారు.
అవేంటంటే..?
-వాంతులు చేయించడం ద్వారా శుద్ధి చేయించడం :వామన
-విరేచనం చేయించడం .
-మూలికలద్వారా ఎనిమా ఇవ్వడం .
-వస్తీ కర్మ .
-నాసికా ఔషధం - ముక్కులో ఔషధ చుక్కలు వేయడం.. .
పంచకర్మ చికిత్సలు - ప్రయోజనాలు.. .
పురాతన వైద్యవిధానమైన ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
కానీ పంచకర్మలంటే ఏమిటి? చాలామంది మర్దనం.. అభ్యంగనం.. వేడికాపడం వంటివే పంచకర్మలని భావిస్తుంటారు. నేడు వీటికే విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. కానీ వాస్తవానికి ఈ మర్దన, అభ్యంగనం వంటివి ఆయుర్వేదంలో పంచకర్మ క్రియలకు ముందు చెయ్యాల్సిన పూర్వకర్మలు మాత్రమే.
ప్రకృతిలోని ప్రతి జీవికీ పంచ భూతాలు చాలా ప్రధానమైనవి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని కూడా పంచభూతాత్మకమైనవిగా భావిస్తారు. పంచభూతాలు మనిషి శరీరంలో పిత్త, వాత, కఫం అనే మూడు దోషాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యం అనేది ఈ మూడు దోషాల ఆధారంగానే చేస్తారు. మన శరీర రక్షణలో రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములనే ఏడు ధాతువులు కీలకంగా పనిచేస్తాయి. వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలు సాధారణ స్థితిలో ఉండాలి.
అలా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనం తీసుకునే ఆహారం, ప్రతిరోజూ అనుసరించే అలవాట్ల కారణంగా పిత్త, వాత, కఫం అనే మూడు దోషాలల్లో మార్పులు వస్తాయి అప్పుడు శరీరంలో కొన్ని అవయవాలపై ప్రభావం కనిపిస్తుంది.
ఆయా సమస్యలను పరిష్కరించేందుకు పంచకర్మ చికిత్సలను అనుసరిస్తారు.
0 Comments:
Post a Comment