PAN Card - కేంద్రం కీలక ప్రకటన.. ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు!
పాన్ - ఆధార్ అనుసంధానంపై ఆదాయ పన్ను శాఖ విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ పలువురు పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ, ఇదే చివరి అవకాశం అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ కార్డుదారులు మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో ఏప్రిల్ 1, 2023 నుంచి వారి పాన్ కార్డు పనిచేయదని పేర్కొంది. “ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి..” అని ఆదాయ పన్ను శాఖ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం పాన్ – ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్ నిరుపయోగంగా మారి బ్యాంక్ ఖాతాలు గానీ, డీమ్యాట్ అకౌంట్ గానీ తెరవడానికి సాధ్యపడదు. పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలనుకుంటే కింది విధానాన్ని ఫాలో అవ్వండి.
పాన్- ఆధార్ అనుసంధానం చేయు విధానం
పాన్- ఆధార్ అనుసంధానానికి ముందుగా మీరు రూ. 1,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
ఇప్పుడు NON-TDS/TCS (Challan No./ITNS 280) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అనంతరం Tax applicable – (0021) ఆప్షన్‌ను ఎంచుకొని, తర్వాత (500) Other Receipts ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత పేమెంట్ చేయు విధానం, పాన్ నెంబర్, మదింపు సంవత్సరం, అడ్రస్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ తదితర వివరాలు పొందుపరిచి.. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
ఈ ప్రక్రియ పూర్తి చేశాక 3 – 5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో పాన్ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment