Palak Paneer - పాలక్-పనీర్ కలిపి తినకూడదా..?ఎందుకు..? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు..?
కొన్నిరకాల కాంబినేషన్ లో ఆహారపదార్థాలను తినకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు కారణాలు కూడా వెల్లడించారు. చలికాలంలో అందరూ ఎక్కువగా తీసుకునే కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది పాలకూర, పనీర్ కర్రీ మాత్రమే. డిన్నర్ నుంచి పార్టీల వరకు సందర్భం ఏదైనా కావొచ్చు. పాలక్- పనీర్ కాంబో ఖచ్చితంగా ఉంటుంది.
ప్రముఖ హోటళ్లలో వెజ్ మెనూలో తప్పనిసరిగా ఉండే కర్రీ పాలక్ ,పనీర్. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల దీనిని పోషకమైన ఆహారంగా కూడా పరిగణిస్తారు.ప్రొటీన్, ఫైబర్, వివిధ రకాల ఇతర సూక్ష్మపోషకాలు పాలకూరలో లభిస్తాయి. పనీర్ లో కూడా ప్రోటీన్, కాల్షియం అత్యంతగా ఉంటాయి.
ఇవి మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.
పాలకూర ,పనీర్ రెండూ ఎముకలను దృఢంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. కానీ పాలక్, పనీర్ ఇవి రెండు వేటికవే మంచి పోషక విలువలు ఉన్న ఆహారపదార్థాలే.. కానీ వీటిని కలిపి తినడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పాలక్, పనీర్ ఎందుకు కలిసి తినకూడదనడానికి పలు కారణాలు చెప్పారు. కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవి, కానీ అవి కలిపి తింటేవాటి పోషకాహార ప్రయోజనాన్ని తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. పనీర్ లోనూ, పాలకూరలోనూ ఒకేరమైన పోషకవిలువలు ఉండడం వల్ల పోషకాల శోషణను నిరోధించే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.
పాలక్ - పనీర్ కర్రీ ఎందుకు తినొద్దు అంటే..?
ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్య పరంగా సరైన కాంబినేషన్ కాదని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలను సరైన కాంబి నేషన్‌లో తినాలి. లేదంటే వాటి ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందలేమని ఆమె అంటున్నారు.
ఒకేరకమైన పోషకాలున్న ఆహారపదార్థాలు కలిపి తింటే ఒకదానికొకటి పోషకాల శోషణను నిరోధించే కొన్ని కాంబినేషన్‌లు ఉంటాయని, అటువంటి కలయికలో జాగ్రత్తలు అవసరమని ఆమె వెల్లడిస్తున్నారు. గమనిక: పలు సర్వేలు, పోషకాహార నిపుణుల అభిప్రాయాలమేరకే ఈ సమాచారం అందించాం.. వీటిలో ఏ సందేహం కలిగిన వైద్యులను సంప్రదించగలరు.
పాలకూరలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా పనీర్‌లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఆహార పదార్థాలను కలిపి తింటే కాల్షియం, ఐరన్‌ను శోషించడాన్ని నిరోధిస్తుంది. కాబట్టి పాలక్ ఆలూ లేదా పాలక్ మొక్కజొన్న కలిపి తినొచ్చని "అని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ సూచిస్తున్నారు.
ఫుడ్ కాంబినేషన్ గురించి ఆయుర్వేద వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..?
ఆయుర్వేదం ప్రకారం కూడా పలురకాల ఆహారపదార్థాలను కలిపి తినకూడదు. అందుకోసమే పురాతన వైద్య విధానంలో అరటి-పాలు వంటి కొన్ని పదార్ధాల కలయికను నిషేదించేవారు. ఎందుకంటే వాటిని కలిపి తీసుకుంటే విషతుల్యం అవుతుందని..అందుకోసమే ఆయుర్వేద నిపుణులు పలురకాల ఆహార పదార్థాలను కలిపి తినొద్దని చెబుతున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. చేపలు-పాలు, తేనె - నెయ్యి,పెరుగు-జున్ను వంటివి కూడా విరుద్ధమైన ఆహార పదార్థాలుగా పరిగణిస్తున్నారు.
0 Comments:
Post a Comment