భారతీయ సంప్రదాయం భాగం పాన్. సాధారణంగానే చాలా మంది పాన్ వేసుకుంటుంటారు. ఇళ్లలో భోజనం తరువాత, ఫంక్షన్ హాళ్లలో భోజనం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పాన్ తింటుంటారు.
పాన్ ఆరోగ్యానికి మంచి చేస్తుందని, భోజనం చేసిన తరువాత పాన్ తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే చాలా మంది ఆహారం తిన్న వెంటనే పాన్ తింటుంటారు.
అయితే, పాన్ తినడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. పాన్ తిన్న తరువాత కొన్ని పదార్థాలు తింటే అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు. సాధారణంగా తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరిచే గ్యాస్ట్రో-ప్రొటెక్టీవ్, కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి.
ఈ కారణంగా భోజనం తరువాత దీనిని తినే సంప్రదాయం ఉంది. అయితే, పాన్ తిన్న తర్వాత కొన్ని ఆహారి తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెడిసిన్స్..
పాన్ తిన్న తరువాత మెడిసిన్ వేసుకోవద్దు. కనీసం ఒక గంట లేదా అరగంట తరువాత మాత్రమే మెడిసిన్ వేసుకోవాలి. అలా కాకుండా పాన్ తిన్న తరువాత మెడిసిన్ వేసుకుంటే.. ప్రతిచర్య జరిగే ప్రమాదం ఉంది. అది మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది.
జ్యూస్ తాగొద్దు..
పాన్ తిన్న తర్వాత జ్యూస్ తాగొద్దు. ఒక పార్టీలో పాన్, జ్యూస్ రెండూ ఉంటే ముందుగా జ్యూస్ తాగాలి. ఆ తర్వాతే పాన్ తినాలి. పాన్ తిన్న తర్వాత జ్యూస్ తాగితే ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది.
ఇక రాత్రిపూట జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియకు హాని కలుగుతుంది. అలాగే పాన్ తిన్న తర్వాత పాలు తాగకూడదు.
స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు..
పాన్ తిన్న తరువాత స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి. స్పైసీ ఫుడ్ జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తుంది. అందుకే పాన్ తిన్న తరువాత పొరపాటున కూడా కారం, లవంగాలు వంటివి తినకూడదు.
0 Comments:
Post a Comment