Organ donar:అవయవ దానం ఎలాంటి వాళ్లు చేయాలి..? ఎలాంటి వాళ్లు చేయకూడదు..?
అవయవ మార్పిడి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆవశ్యకంగా మారింది. అవయవ మార్పిడి చేయాలనే నిర్ణయం వ్యక్తిగతమైనది. అయితే వ్యక్తిగత పరిస్థితులతోపాటు, వైద్య అవసరాలపై అవయవమార్పిడి అనేది ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా ఒక వ్యక్తి గుండె, కాలేయం లేదా మూత్రపిండాలు వంటివి సరిగా పనిచేయకపోయినట్లైతే అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసినా మార్పు రాకపోతే అవయవ మార్పిడి తప్పనిసరి అవసరం కావచ్చు. ఆ సమయంలోనే డాక్టర్ల సూచనల మేరకు అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా జరుగుతుంది.
అవయవదానం చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ అతనికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే..అతని అవయవాలు దానం చేసినా సంబంధిత రోగికి వాటిని ఇవ్వలేరు.
మానవ శరీరంలో మార్పిడి చేసేందుకు అవయవాలు ఉన్నాయి.. అవి..
* గుండె
* కాలేయం
* కిడ్నీలు
* జీర్ణరసాలను తయారుచేసే గ్రంథి(ప్యాంక్రియాస్)
* ఊపిరితిత్తులు
* ప్రేగులు
*కళ్లు
కిడ్నీ మార్పిడి చాలా సాధారణంగా నిర్వహిస్తారు. డయాలసిస్ కంటే కిడ్నీ మార్పిడి చాలా ప్రభావవంతమైనది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వారికి డయాలసిస్ కంటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎవరైనా ఏ వయసులోనైనా అవయవ దాత కావచ్చు. కానీ 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తీసుకోవాలి.
మరణం తర్వాత అవయవ దానం కోసం, ఏ అవయవాలను దానం చేయవచ్చో నిర్ణయించడానికి వైద్యపరమైన పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. హెచ్ఐవీ, క్యాన్సర్, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతు న్నవారు, మధుమేహం, మూత్రపిండ వ్యాధి లేదా గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవాళ్లు అవయవదానం చేయడానికి అర్హులు కాదు.
0 Comments:
Post a Comment