Oneplus Smart TV Offer: రూ.4,999కే 32 అంగుళాలు, రూ.8,999కే 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్స్!
Smart TV Offers | వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి లభిస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే అదిరే టీవీ కొనొచ్చు.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ డీల్ అందుబాటులో ఉంది. పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ వంటివి పొందొచ్చు. ఇవ్వన్నీ కలుపుకుంటే రూ. 5 వేల కన్నా తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు బెజిల్‌లెస్ డిజైన్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. వివిధ స్క్రీన్ పరిమాణాల్లో వన్ ప్లస్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 32 అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఒకటి ఉంది. వన్‌పస్ల్ వై1 ఎస్ స్మార్ట్ టీవీ ఇది. ఈ టీవీని ఇప్పుడు మీరు రూ. 5 వేల కన్నా తక్కువ ధరలోనే కొనుగోలు చేయొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రేటు రూ. 20 వేలకు పైనే ఉంది. రూ. 21,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు డిస్కౌంట్‌లో రూ. 15,999కు కొనొచ్చు. 27 శాతం తగ్గింపు ఉంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే అప్పుడు మీరు ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 4,999కే కొనొచ్చని చెప్పుకోవచ్చు.
కేవలం ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా మరో డీల్ కూడా ఉంది. అదే బ్యాంక్ ఆఫర్లు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొన్నా కూడా ఇలాంటి ఆఫర్ పొందొచ్చు. ఇలా బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు.
ఇకపోతే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలో 32 అంగుళాల స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, డీల్బే ఆడియో, 20 వాట్ స్పీకర్లు, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్ని సపోర్టు చేస్తుంది. అలాగే 40 అంగుళాల స్మార్ట్ టీవీ అయితే రూ.10 వేల కన్నా తక్కువకే పొందొచ్చు. దీని రేటు రూ. 27,999. అయితే రూ. 19,999కు అందుబాటులో ఉంది. రూ.11,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే ఈ టీవీని రూ. 8,999కే కొనొచ్చు.
0 Comments:
Post a Comment