Omicron BF7 Veriant: ఇండియన్స్ కి గుడ్ న్యూస్..ఈ వైరస్ వల్ల మనకి ఏమీ కాదట..ఎలాగంటే..?
Omicron BF7 Veriant: ఓమిక్రాన్ బి.ఎఫ్. 7 వేరియంట్ మరొకసారి ప్రపంచ దేశాలను గజగజ వనికిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వేరియంట్ దేశాన్ని మొత్తం అతలాకుతలం చేస్తూ చాలా తొందర తొందరగా విజృంభిస్తుంది. అక్కడ కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. అంతేకాకుండా జపాన్,దక్షిణ కొరియా, బ్రెజిల్,అమెరికా వంటి దేశాలలో కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల మన దేశంలోని ఆరోగ్యాధికారులు అలర్ట్ అయ్యారు.
అయితే తాజాగా ఆ దేశాలతో పోలిస్తే మన దేశం లో కేసులు పెరిగే సంఖ్య లేదని అందుకు మూడు కారణాలు ఉన్నాయి అంటూ ఆ పత్రిక వెల్లడించింది. కానీ టీకా తీసుకోవడం మాత్రం మానద్దు అని హెచ్చరించింది. అయితే చైనా (China) లో అంతగా కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటో అనే అంశాలను పరీక్షించారు. ఇక ఈ రెండు దేశాల కరోనా పరిస్థితులను పోల్చినప్పుడు చైనా కంటే మన దేశంలో అంతగా కరోనా కేసులు పెరగకపోవచ్చు అనే విషయం వెళ్లడైంది.
ఒకవేళ 100% వాక్సినేషన్ అనేది లేకపోతే చైనా లాగే మన భారతదేశం (India) కూడా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది అని సూచిస్తుంది. అలాగే చైనా కంటే భారత దేశంలో వేసిన వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనదేశంలో మొదటి రెండు డోసులే కాకుండా బూస్టర్ డోస్ కూడా వేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలోని ఎన్నో ఇన్స్టిట్యూట్లో మంచి మంచి టీకాలను అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వంటి టీకాలు ఇప్పటికే చాలామంది వేసుకున్నారు. అలాగే మన భారతదేశంలో వయసును బట్టి టీకాలు వేశారు కానీ చైనాలో అలా లేదు.
ఈ విషయంలో చైనా భారతదేశం కంటే పూర్తి భిన్నంగా ఉంది. అలాగే అక్కడ యువత కంటే ఎక్కువ వృద్ధులకే వాళ్లు వ్యాక్సిన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక చైనా కంటే ముందే భారతదేశంలో ఓమిక్రాన్ బి. ఎఫ్.7 వేరియంట్ (Omicron BF7 Veriant) ని గుర్తించారు. అయినప్పటికీ చైనాలాగా ఇక్కడ కేసులు పెరగడం లేదు. అలా అని జీవితకాలం ఇలాగే ఉంటుంది అని భ్రమపడవద్దు. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే చైనా లాగే మన పరిస్థితి కూడా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
0 Comments:
Post a Comment