NTR.. సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నటనతో రాజకీయపరంగా ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందగలిగారు .
సాధారణంగా గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే చేయగలరు. అలాంటి కొంతమందిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నప్పుడే తన 60 వ పుట్టినరోజుకి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు.
అలా అనుకున్నది తడువుగా అటువైపు అడుగులు వేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రథయాత్ర చేశారు.
ఆయన నినాదం జనాలకు మంత్రంలా పనిచేసింది.అందుకే పార్టీ మొదలు పెట్టిన తొమ్మిది నెలలకి అధికారంలోకి వచ్చిన సంచలనం సృష్టించారు.
ఇదిలా ఉండగా ఒకరోజు అనంతపురం పర్యటనకు వెళ్ళిన అన్నగారికి రోడ్డు పక్కన ఇద్దరు వృద్ధ దంపతులు పని చేసుకుంటూ కనిపించారు .
వారిని చూసి కారు ఆపి దగ్గరకు వెళ్లి వారి పరిస్థితి చూసి అసలు విషయం ఏమిటో అడిగారు ఎన్టీఆర్. ఎందుకు మీరు ఇక్కడ పని చేస్తున్నారు ఏ వయసులో మీకు ఇక్కడ పని ఏంటి అని అడగంగా దాంతో ఆ వృద్ధ దంపతులు తమ పరిస్థితిని వివరించారు.
' అయ్యా.. మాకు ఎకరంనర భూమి ఉంది. ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారికి చెరొక అర్థ ఎకరం పంచి తామ అర్ధ ఎకరము దున్నుకుంటున్నాము.
నా కొడుకులు ఆ అర్ద ఎకరంలో పంట పండించి కుటుంబాన్ని, పిల్లలను పోషించాలి. వారికి మమ్మల్ని చూసుకునే స్తోమత కూడా లేదు అందుకే ఈ భూమిని మేమే దున్నుకుంటున్నాము' అని చెప్పారు.
ఆరోజు అన్నగారికి వారిని చూడగానే మనసు చలించిపోయింది. దాంతో వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టి వృద్ధులకు చేయూత ఇచ్చారు. నాడు ఆ వృద్ధులను చూసి ఎన్టీఆర్ చేపట్టిన పని నేడు చరిత్ర తిరగరాసింది.
ఈ పద్ధతిని ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో అవలంబిస్తున్నారు కూడా.. అంతేకాదు పేదల ఆకలిని తీర్చడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి బడుగు, బలహీన వర్గాలకు కడుపునిండా అన్నం తినే అదృష్టాన్ని కలిగించాడు. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి మరొకరు రారు అని చెప్పడంలో సందేహం లేదు.
0 Comments:
Post a Comment