నాన్ వెజ్ తినే మొక్కల గురించి మీకు తెలుసా..?
నాన్ వెజిటేరియన్స్ మనుషులు, జంతువుల్లో ఉన్నట్టుగానే మొక్కల్లో కూడా ఉంటాయి.. అవును ఇది నిజం.. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనుగడ సాగించే మొక్కలేకాదు.. కేవలం మాంసాహారం తిని జీవించే మొక్కలు కూడా భూమి మీద ఉన్నాయి. క్రిమికీటకాలను తిని బతికే చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు రుజువుచేశాయి కూడా.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
నెపెంథస్, పోర్చుగీస్ సన్ డ్యూ, మొకాసిన్, కోబ్రాలిల్లీ, వీనస్ ప్లైట్రాప్ వంటి మొక్కలు నాన్ వెజ్ మాత్రమే తింటాయి.
పోర్చుగీస్ సన్ డ్యూ: ఎంతటి తెలివైన జీవినైనా ఆహారంగా మార్చుకోగలిగే శక్తి "పోర్చుగీస్ సన్ డ్యూ మొక్కకు "ఉంది.
ఈ మొక్కలు చూడడానికి అందంగా కనిపి స్తాయి. మొక్క పైభాగంలో వెంట్రుకల ఆకారంలాంటి కాడల మీద జిగురుగా ఉండే మకరందాన్ని ఉంచుతాయి. మక రందం కోసం వచ్చిన కీటకాలు అ జిగురుకు అతుక్కుపో తాయి.
వెంటనే వాటిని మొక్క లోపలికి ముడుచుకొని కీట కాలు తప్పించుకోకుండా బంధించి ఆహారంగా స్వీకరిస్తుంది. అలా తమ మనుగడ సాగిస్తుంటాయి ఈ మొక్కలు. వీటికి "డ్రోసరా సన్ డ్యూ అనే మరోపేరు కూడా ఉంది. పోర్చుగీసులో ఇవి విరివిగా కనిపిస్తాయి. అందుకే ఈ మొక్కను "పోర్చుగీస్ సన్ డ్యూ" అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం డ్రోసోఫిలం లుసజీనికం. ఇవి స్పెయిన్, పోర్చుగ్రీస్ "లలో నత్రజని తక్కువగా ఉండే నేలల్లో ఇవి పెరుగుతాయి.
0 Comments:
Post a Comment