Hyderabad: దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎం.. హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
బేగంపేటలోని అశోక రఘుపతి చాంబర్స్‌లో గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు.
ఈ ఏటీఎంను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నిన్న ప్రారంభించారు.
ఈ ఏటీఎం ద్వారా అర గ్రాము నుంచి వంద గ్రాముల వరకు గోల్డ్ కాయిన్స్ తీసుకునే వెసులుబాటు ఉందని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడం కోసం బంగారం షాపునకు వెళ్లాలంటే మోహమాటపడే వారికి ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారికి ఈ ఏటీఎం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
0 Comments:
Post a Comment