New Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1,25,000 వరకు పెన్షన్... కొత్త రూల్స్ ఇవే
1. వృద్ధాప్యంలో పెన్షన్ వృద్ధులకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్ రూల్స్ ప్రకటించింది. ఉద్యోగులకు రూ.1,25,000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ రూల్స్ ప్రకటించింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల్ వెల్‌ఫేర్ (DoPPW). (ప్రతీకాత్మక చిత్రం)
2. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 పేరుతో పెన్షన్ మంజూరు షరతులను విడుదల చేసింది. నవంబర్ 4న విడుదల చేసిన ఆఫీస్ మెమొరండంలో అనేక వివరాలు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని ఎలా లెక్కించాలో కూడా డిపార్ట్‌మెంట్ వివరించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972ని రద్దు చేయాలని పెన్షన్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్)కి నోటిఫై చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సెంట్రల్ సివిల్ సర్వీస్ (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 44లోని సబ్-రూల్ (1) ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి, పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులు. రూల్ 33 (సూపర్ యాన్యుయేషన్ పెన్షన్), రూల్ 34 (రిటైరింగ్ పెన్షన్), రూల్ 35 (రాష్ట్ర ప్రభుత్వంలో లేదా దాని కింద అబ్సార్ప్షన్‌పై పెన్షన్), రూల్ 36 (కార్పొరేషన్, కంపెనీ లేదా బాడీలో లేదా కింద అబ్సార్ప్షన్‌పై పెన్షన్) ప్రకారం పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీటితో పాటు రూల్ 37 (ప్రభుత్వ విభాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడం ద్వారా అబ్సార్ప్షన్‌పై పెన్షన్, రూల్ 38 (ప్రభుత్వ శాఖను కేంద్ర స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చడం ద్వారా అబ్సార్ప్షన్‌పై పెన్షన్) లేదా రూల్ 39 (ఇన్‌వేలిడ్ పెన్షన్) ప్రకారం పెన్షన్ లభిస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల్ వెల్‌ఫేర్ తెలిపింది. 10 ఏళ్ల కన్నా తక్కువ కాకుండా క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి ఈ పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. పైన వివరించిన అన్ని కేసులకు, వేతనంలో 50 శాతం లేదా సగటు వేతనంలో 50 శాతంలో ఉద్యోగికి ఏది ఎక్కువ లాభదాయకంగా ఉంటుందో దాని ప్రకారం పెన్షన్ లెక్కించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు కనీస పెన్షన్ రూ.9,000 లభిస్తుంది. రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి హోదా, సీనియారిటీని బట్టి నెలకు కనీస పెన్షన్ రూ.1,25,000 వరకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. క్వాలిఫయింగ్ సర్వీస్ రూల్ వివరాలు చూస్తే రూల్ 33, రూల్ 34, రూల్ 35, రూల్ 36, రూల్ 37, రూల్ 38, లేదా రూల్ 39 కింద పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగి, పదేళ్లకు తగ్గకుండా క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఉదాహరణకు, ఓ ఉద్యోగి తొమ్మిదేళ్ల తొమ్మిది నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసినట్టైతే పదేళ్లలోపు పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారు. వారి క్వాలిఫయింగ్ సర్వీస్ పదేళ్లు ఉంటుంది. రూల్ ప్రకారం పెన్షన్‌కు అర్హులు అని పెన్షన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment