Nelloreలో చికెన్ తింటున్నారా?..ఈ గుట్టు తెలుస్తే ఛీ అంటారు..!
నెల్లూరులో మరోసారి కుళ్లిన మాంసం లభించడం కలకలం రేపింది. ఇటీవల మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వరుస దాడులలో కుళ్లిన మాంసం విక్రయాలను అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఆ ఘటన మరువకముందే మరోసారి కుళ్లిన మాంసానాన్ని నెల్లూరు నగర మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ స్వాధీనం చేసుకున్నారు. హరినాధపురం సెంటర్లో ఒక అంగడిలో దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు నెల్లూరు మున్సిపల్ ఆరోగ్య విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ తన సిబ్బందితో ఆ షాప్‌లో తనిఖీలు చేయగా భారీగా కుళ్ళిన మాంసం నిల్వలు బయటపడ్డాయి. పురుగులు పట్టిన చికెన్ దాదాపు 600 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో షాప్ యజమానిని ప్రశ్నించడంతో అసలు గుట్టు రట్టైంది. బయట ప్రాంతాల నుంచి చికెన్ తీసుకువచ్చి నెల్లూరులో పలు హోటల్స్, షాపులకు విక్రయిస్తుంటారని తెలియజేశాడు. అందులో భాగంగానే నిల్వ ఉంచినట్లు అంగీకరించాడు. ఇదిలా ఉంటే గతంలో కూడా చెన్నై నుంచి చికెన్ వ్యర్ధాలు తీసుకొచ్చి నెల్లూరులోని పలు హోటల్స్‌కి సరఫరా చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ అక్రమార్కులు కుళ్ళిన మాంసాన్ని అమ్మడం మానుకోలేదు. ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment