అందంగా ఉండాలని.. అందరికీ అందంగా కనిపించాలని యువతీయువకులు కోరుకుంటారు. అమ్మాయిలయితే అందంగా కనిపించడం కోసం తమని తాము బ్యూటీ టిప్స్ సాయంతో మార్చుకుంటుంటారు.
వేసుకునే జుట్టు నుంచి కాళ్లకు ధరించే చెప్పుల వరకూ బెస్ట్ ని ఎంపిక చేసుకుంటారు. అందం కోసం తమ చేతి, కాలి గోర్లను సైతం నెయిల్ పాలిష్ తో అలంకరించుకుంటారు. రకరకాల నెయిల్ పాలిష్ లను రకరకాల స్టైల్స్ లో వేసుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.
ప్రపంచంలోని చాలా మంది అమ్మాయిలు నెయిల్ పాలిష్ వేసుకోవడానికి వివిధ రంగుల నెయిల్ పాలిష్ లను ఎంపిక చేసుకుంటున్నారు.
అయితే ఈ అందమైన రంగురంగుల నెయిల్ పాలిష్ లను గోర్లకు వేసుకోవడం వలన ఆరోగ్యానికి హాని జరుగుతుందని మీకు తెలుసా.. పెద్దవారికి మాత్రమే కాదు.. చిన్న పిల్లలకు కూడా నెయిల్ పాలిష్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు నెయిల్ పెయింట్స్ తో కలిగి అనారోగ్యాల గురించి తెలుసుకుందాం..
ఆరోగ్యంపై నెయిల్ పాలిష్ దుష్ప్రభావాలు
నెయిల్ పాలిష్ రోజూ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా.. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు అందులో ఉండే ప్రమాదకరమైన రసాయనం మన కళ్ల ద్వారా, నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి గురిచేస్తుంది.
ఈ రంగురంగుల సౌందర్య ఉత్పత్తులు నెయిల్ పాలిష్ లను ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ప్రయోగశాలల్లో ఉపయోగించే ఈ రసాయనం మన శరీరంలోని వెళ్లడంతో చర్మం పై దురద, స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.
నెయిల్ పాలిష్ ఎంత హాని కలిగిస్తుందంటే?
నెయిల్ పాలిష్‌లో ఉన్న ఈ ప్రమాదకరమైన రసాయనం మీ శరీరాన్ని తాకినప్పుడు మీ శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
నెయిల్ పెయింట్‌లో ఉండే రసాయనాలు మీ కడుపులోని జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హార్మోన్ల వ్యవస్థలో కూడా ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది.
నెయిల్ పాలిష్ లను ఎక్కువగా ఉపయోగించే మహిళల్లో ట్రిఫెనైల్ ఫాస్ఫేట్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు కనుగొన్నారు. ఇది మహిళలను అనారోగ్యానికి గురి చేస్తుంది.
నెయిల్ పాలిష్‌లో ఉండే టొల్యూన్ రసాయనం.. ఎవరి శరీరంలోకి అయినా అధిక పరిమాణంలో చేరినట్లయితే, అది మహిళల కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
నెయిల్ పాలిష్‌లో టొల్యూన్ అనే మూలకం ఉంటుంది.ఇది నేరుగా పాలిచ్చే మహిళల నుండి చిన్నపిల్లలకు చేరుతుంది. ఇది భవిష్యత్తులో పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
నెయిల్ పెయింట్ ఉపయోగించడం వల్ల నష్టాలు
నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడటం వల్ల మన గోళ్లు బలహీనంగా మారి క్రమంగా వాటిల్లో పగుళ్లు రావడం మొదలవుతుంది. అంతేకాదు నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడటం వల్ల గోళ్లు తమ సహజ మెరుపుని కోల్పోతాయి.
నెయిల్ పెయింట్ ఉపయోగించడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.
మీరు రోజూ వాడే నెయిల్ పెయింట్‌లో టొలుయెన్ అనే రసాయనం కలుపుతారు. ఈ రసాయనం గోళ్ళ కణాల ద్వారా మన శరీరంలోని ఇతర కణాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా.. ఈ టోలున్ రసాయనం కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
నెయిల్ పాలిష్ తయారీలో ఉపయోగించే స్పిరిట్ ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపుతుంది.
నెయిల్ పెయింట్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
నెయిల్ పాలిష్ తయారు చేయడానికి అక్రిలేట్స్ అనే మరో రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ రసాయనం మన చర్మంతో పాటు.. శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లిన తర్వాత చాలా హానికరంగా మారుతుంది. కొంతమంది మహిళలల్లో పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణం అవుతుంది.
0 Comments:
Post a Comment