Mukesh Ambani : వెంట్రుకలున్న కొప్పు ఎటేసిన అందమే. డబ్బున్న వాళ్లు ఏది చేసినా ఘనమే. దానికి వారి దగ్గర బాగా ధనం ఉంటమే. ప్రపంచంలోని కుబేరుల్లోనే ప్రముఖులుగా పేర్కొన్న వారిలో ముఖేష్ అంబానీ ఒకరు.
ఆయనకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. వారికి వ్యాపారాలు అప్పగించి వారిని ఓ దారిలోకి తీసుకొచ్చారు. అంబానీకి కూతురంటే ప్రాణం. అందుకే ఆమె వివాహానికి రూ.200 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
కూతురు ఇషా అంబానీకి కవలలు జన్మించారు. అందులో ఒకరు పాప, ఇంకొకరు బాబు. దీంతో అంబానీ కుటుంబానికి అంతులేని సంతోషం కలుగుతోంది. వారసుల కోసం అంబానీ సంబరాలు ఏర్పాటు చేశారు.
అమెరికాలో ఉన్న వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఖతర్ ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేయడం అంటే అంబానీకి అక్కడి ప్రభుత్వం ఎంతటి విలువ ఇస్తుందో తెలుస్తూనే ఉంది.
వారసులు ఇండియాకు వచ్చిన తరువాత ఇంటిలో సంబరాలు ఏర్పాటు చేశారు. ఏకంగా 300 కిలోల బంగారాన్ని పేదలకు అందజేశారు. ఇలా అంబానీ తన స్ట్రాటజీని చాటుకున్నారు.
తమ వారసుల కోసం ఇంత భారీ మొత్తంలో బంగారం పంపిణీ చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. డబ్బున్న వారు ఏది చేసినా అర్థమే. పేదవాడు ఏది చేసినా అనర్థమే.
ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ దంపతులకు నవంబర్ 19న కవలలు జన్మించారు. వీరిలో అమ్మాయికి ఆద్య, అబ్బాయికి కృష్ణ అని నామకరణం చేశారు. అమెరికాలో జన్మించిన వారు నెల రోజుల తరువా ఇండియాకు రావడంతో పెద్ద వేడుక నిర్వహించారు.
మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికారు. అంబానీ నివాసం అంటిల్లా రెసిడెన్స్, పిరమళ్ నివాసం కరుణ సింధులలో సంబరాలు అంబరాన్నంటాయి.
భాజా భజంత్రీలతో వారసులను ఎంతో వేడుకగా తీసుకురావడం గమనార్హం. అంబానీ తాత కావడంతో తమ మనవడు, మనవరాలి కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
అమెరికాలో బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్బన్ కూడా వీరి వెంట వచ్చారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమెరికన్ నర్సులు వీరితో ఉన్నారు. వీరి బాగోగులు చూడటానికి ఎనిమిది మంది ప్రత్యేక అమెరికన్ ఆయాలు వచ్చారు.
ఇలా ముఖేష్ అంబానీ తన వారసుల కోసం ముఖేష్ ఖర్చు ఎంతో ఘనంగా నిర్వహించడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తమ వారసులకు దేశంలోని అన్ని దేశాల నుంచి ప్రసాదాలు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.
తిరుపతి నుంచి బాలాజీ, నాథ్ ద్వారా శ్రీనాథ్, శ్రీ ద్వారకాదీశ్ నుంచి ప్రసాదాలు తెప్పించారు. అంబానీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మూడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకొచ్చారు.
0 Comments:
Post a Comment