Mouth Clean Tips - నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు చిట్కాలు..
ఎదుటి వారితో మాట్లాడుతున్న సమయంలో వారికి నీ నోరు కంపు వాసన వస్తుందని చెప్పాలనిపిస్తుంది కాని వారు నొచ్చుకుంటారేమో అంటూ మనం మౌనంగా ఉంటాం. ఇలా నోటి దుర్వాసన రావటంకు కారణం ఏంటీ.. ఆ దుర్వాసన పోగొట్టుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉదయాన్నే లేచిన సమయంలో మన నోరు ఎక్కువగా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరిది వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. వారి నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు ఉదయాన్నే బ్రస్ చేసుకుంటూ ఉంటాము. కొందరు బ్రస్ చేయకుండా పొద్దున్నే పాసి నోరు తో టీ లేదా కాఫీ తాగేస్తూ ఉంటారు. అలా తాగడం వల్ల మరింతగా నోరు చెడి పోతుంది.
నోటి లో దుర్వాసన కలగడానికి ప్రధాన కారణం ముందు రోజు తిన్న ఆహార పదార్థాలు.
తిన్న తర్వాత నోటిలో ఆహార పదార్థాల తాలూకు ప్లేవర్ ఇంకా కొద్ది మొత్తంలో అలా నోట్లోనే ఉండి పోతుంది. అది కాస్త తెల్లారిన తర్వాత దుర్వాసనగా మారుతుంది. పడుకుని లేచిన తర్వాత దుర్వాసన రాకుండా ఉండాలంటే మొదటగా రాత్రి పడుకునే సమయంలో నోరు బాగా కడుక్కుని సాధ్యం అయితే నిమిషం లేదా రెండు నిమిషాల పాటు బ్రెష్ చేసుకుని ఆ తర్వాత కడుక్కుంటే ఉదయాన్నే దుర్వాసన తగ్గుతుంది. దాల్చిన చెక్క లేదా లవంగాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నోటి దుర్వాసన కు మనం తినే ఆహార పదార్థాలు కారణంగా చెబుతున్నారు.
ఇప్పుడు నోటి దుర్వాసన పోగొట్టే లిక్విడ్ లు చాలా వచ్చాయి. ఆ లిక్విడ్ ను నోట్లో పోసుకుని పుక్కిలించి ఆ తర్వాత సాదారణంగా ఉండవచ్చు. రాత్రి సమయంలో తినే ఆహార పదార్థాలు ఏవి అయినా కూడా తిన్న తర్వాత ఖచ్చితంగా నోరు శుబ్రం చేసుకోవాలి. చాలా మంది చాలా రకాలుగా నోరు శుభ్రంకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని ఇలాచీ లేదా దాల్చిన చెక్క వల్ల నోరు అయినంత ఫ్రెష్ గా ఏ లిక్విడ్ తీసుకున్న కాదు. నోటి దుర్వాసన ఉంటే ఎదుటి వారి వద్ద చెడుగా అవ్వడంతో పాటు పలు అనారోగ్య సమస్లు కూడా తలెత్తుతాయి. నోరు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా అయితే తింటామో.. అలాగే తిన్న తర్వాత కూడా నోరును వాష్ చేసుకున్న వారు కొద్ది మందే ఉంటారు. పిల్లలు అస్సలు నోరు కడిగేందుకు బద్దకిస్తారు. కనుక పెద్ద వారు అయినా నోరును నీట్ గా ఉంచాలి.
0 Comments:
Post a Comment