Mosquitoes: కెమికల్స్ లేకుండా దోమలను పారదోలే పద్ధతులు ఏంటో తెలుసా?
Mosquitoes: మనం ఇంట్లో హాయిగా నిద్రపోవాలంటే దోమల బెడదతో సరిగా కుదరడం లేదు. రాత్రయిందంటే చాలు దోమల మోతతో ఇల్లంతా గందరగోళంగా మారుతుంది. దీంతో మనం నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటాం.
ఏవో జెట్ బిళ్లలు, ఇంకా ఇతర సాధనాలు ఉపయోగించినా వాటి రొద మానదు. అవి చేసే శబ్ధంతోనే మనకు నిద్ర పట్టదు. అటు ఇటు తిరుగుతూ ఎప్పుడో పన్నెండు దాటిన తరువాత నిద్ర పోతుంటాం. దోమల బాధకు అసలు నిద్ర రావడమే గగనం. ఈ నేపథ్యంలో దోమల నుంచి రక్షించుకోవడానికి సహజసిద్ధమైన ప్లాన్లు ఉన్న సంగతి అందరికి తెలియదు. వీటిని అనుసరిస్తే మనకు దోమల బెడద ఉండదు. ఇక అవి మళ్లీ మన ఇంటివైపు రావనే సంగతి చాలా మందికి అవగాహన లేదు.
దీనికిగాను మనం చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదు. చిన్నపాటి చిట్కానే. అది కూడా మన ఇంట్లోనే చేసుకునేది కావడం గమనార్హం. వేప నూనె కావాలి. వేప నూనె అంటే దోమలకు పడదు. ఓ మూడు స్పూన్ల వరకు వేప నూనె ఒక బౌల్లోకి తీసుకోవాలి. నాలుగు కర్పూరం బిళ్లలను పొడి చేసి రెండింటిని మిక్స్ చేసి రెండు బిర్యానీ ఆకులకు ఈ పేస్టుని రాయాలి. ఇప్పుడు ఆకులను దోమలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ అగ్గిపుల్లతో వెలిగించి కాల్చి పొగ చేయాలి. అంతే దోమలు ఆ పరిసరాల్లోకి రావు.
ఇంకో పరిహారంలో ఇంతకుముందు తయారు చేసుకున్న వేపనూనె కర్పూరం పొడిని ఒక ప్రమిదలో పోసుకుని పెట్టుకుని దాంతో దీపం వెలిగించండి. ఈ నూనెతో వేసిన పొగకు దోమలు పరారవుతాయి. మళ్లీ మన ఇంటి వైపుకు రావు. ఇంకో చిట్కా కూడా ఉంది. వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని ఒక గ్లాసులో వేసుకుని నీళ్లలో మరిగించాలి. ఇలా మరిగించుకున్న నీటిని ఒక బాటిల్ లోకి తీసుకుని దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్ర్పే చేస్తూ ఉండాలి. దీని ఘాటుకు దోమలు ఊపిరాడక వెళ్లిపోతాయి. ఈ చిట్కాలు పాటిస్తే మన ఇంట్లో దోమల బెడద ఉండదు.
Mosquitoes
ఇటీవల కాలంలో దోమల బెడదతో చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. దోమల మోతతో నిద్రకు ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా కంటినిండా కునుకు తీసిన సందర్భాలు సైతం ఉండటం లేదు. దోమల బాధతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో దోమలను దూరం చేసుకునే ఈ చిట్కాలు ఉపయోగించుకుని ప్రశాంతంగా నిద్ర పోయేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించుకుని ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నించుకోవచ్చు.
0 Comments:
Post a Comment