Money: కేంద్రం అదిరే ఆఫర్.. బ్యాంక్ అకౌంట్‌లోకి ఉచితంగా రూ. 10 వేలు పొందండిలా!
Republic Day 2023 | ఉచితంగా రూ.10 వేలు పొందే అద్భుతమైన అవకాశం ఒకటి అందుబాటులో ఉంది.
ఎలా అని అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. ఉచితంగా రూ.10 వేలు లభిస్తాయి.
ఇంతకీ ఆ కాంటెస్ట్ ఏంటి? ఎప్పుడు నిర్వహిస్తారు? ఏం చేయాలి? ఎప్పటికల్లా డబ్బులు లభిస్తాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది.
కొత్త ఏడాదిలో ఉచితంగానే రూ. 10 వేలు పొందే అవకాశం లభిస్తోంది. రిపబ్లిక్ డే కాంటెస్ట్‌లో పాల్గొని పోటీలో విజేతగా నిలిస్తే.. వారికి రూ.10 వేలు లభిస్తాయి. ఇంట్లో నుంచే మీరు ఎక్కడికీ వెళ్లకుండా ఈ డబ్బులు పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మైగౌవ్ ఇండియా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ట్వీట్ ప్రకారం చేస్తే.. మీరు జింగిల్ రూపొందించాల్సి ఉంటుంది.
మీరు రూపొందించిన జింగిల్ అదిరిపోయేలా ఉంటే.. అంటే అందరికీ నచ్చేలా ఉంటే.. మీరు రూ. 10 వేల వరకు గెలుచుకోవచ్చు. కేవలం రూ. 10 వేలు కాకుండా ఇతర ప్రైజ్‌లు కూడా ఉన్నాయి.
మైగౌవ్ . ఇండియా ప్రకారం.. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. మైగౌవ్ భాగస్వామ్యంతో ఈ కాంటెస్ట్ నడిపించనుంది. 2023 రిపబ్లిక్ డే కోసం ఒక జింగిల్ రూపొందించాల్సి ఉంటుంది. కాంపిటీషన్‌లో మీ జింగిల్ గెలిస్తే.. మీకు రూ. 10 వేల రివార్డు లభిస్తుంది.
మీరు రూపొందించే జింగిల్ రిపబ్లిక్ డేకు సంబంధించి ఉండాలి. అలాగే వినసొంపుగా ఉండాలి. అలాగే దేశ భక్తిని చాటి చెప్పేలా మీరు ఈ జింగిల్‌ను రూపొందిచాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ జింగిల్ అనేది అన్ని వయసుల వారికి అర్థం అయ్యేలా ఉండాలి.
ఇంకా రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించాలి. అలాగే ప్రజల విధులను కూడా చర్చించేలా ఉండాలి. ఇలా మీరు రూపొందించే జింగిల్ ఈ అంశాలు అన్నింటినీ కవర్ చేయాలి. అప్పుడు పోటీలో నిలచేందుకు అవకాశం లభిస్తుంది.
జింగిల్ 25 నుంచి 30 సెకన్ల వరకు ఉండాలి. మీరు స్ట్రిప్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. హై క్వాలిటీ ఆడియో ఫైల్ రూపంలో మీరు మీ జింగిల్‌ను అప్‌లోడ్ చేయాలి. అలాగే స్క్రిప్ట్‌ను పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ముందు కొన్ని డేట్స్‌ను గుర్తించుకోవాలి. జనవరి 20లోగా మీరు జింగిల్‌ను సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 20 తర్వాత వచ్చే ఎంట్రీస్‌ను పరిగణలోకి తీసుకోరు. ముగ్గురికి క్యాష్ ప్రైస్ వస్తుంది.
కాంటెస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన వారికి రూ. 10 వేలు లభిస్తాయి. రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 7 వేలు అందిస్తారు. ఇక మూడు స్థానంలో నిలిచిన వారికి రూ. 5 వేలు వస్తాయి. ఇప్పటికే 61 ఎంట్రీస్ వచ్చాయి.
0 Comments:
Post a Comment