Modi Government: కొవిడ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం...
కొవిడ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం పేదలకు మరో ఏడాది పాటు ఉచితంగా బియ్యం అందిస్తారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయం వల్ల 80 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
కొవిడ్ ఫస్ట్ వేవ్ సమయం నుంచి కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. నాటి నుంచి సుదీర్ఘ కాలం ఈ పథకాన్ని కొనసాగించింది. మళ్లీ ఇప్పుడు ఈ పథకాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ వరకూ ఈ పథకం వర్తిస్తుంది. 28 నెలలుగా ఈ పథకం అమల్లో ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌కు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ రివిజన్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర నిర్ణయంతో 25.13 లక్షల మంది మాజీ సైనికుల కుటుంబాలకు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 2019 జూన్ 30లోపు రిటైరైన సైనికులందరికీ ఇది వర్తిస్తుంది. 2019 జులై ఒకటి నుంచి 2022 జూన్ 30 వరకూ ఎరియర్స్ కలిపి ఇస్తారు. ఇందు కోసం కేంద్రం ఏడాదికి 8,450 కోట్ల రూపాయలు కేటాయించనుంది. మోదీ అధికారంలోకి వచ్చాక 2014 జులై ఒకటి నుంచి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. 2015 నవంబర్ 7 ను ఓఆర్ఓపీపై నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.
0 Comments:
Post a Comment