Maternity Leave : సాధారణంగా అయితే మహిళలకు.. అంటే, పెళ్ళయినవారికి.. అందునా ఉద్యోగినులకు మెటర్నిటీ సెలవులు వుంటాయి.
మగవాళ్ళకు సైతం ఈ తరహా సెలవులు (తండ్రిగా కుటుంబ బాధ్యతలు చూసుకునేందుకు, ప్రసవ సమయంలో భార్యను చూసుకునేందుకు) ఇవ్వడం గురించి కూడా వింటున్నాం.
కానీ, ఇక్కడ విద్యార్థినులకు మెటర్నిటీ సెలవులు ఇవ్వడమంటే అది నిజంగానే సంచలనం మరి.! ఓ రాష్ట్రం.. అది కూడా భారతదేశంలోని ఓ రాష్ట్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేరళ ప్రత్యేకత ఇదీ..
కేరళలో చదువుకున్నవారి సంఖ్య ఎక్కువ. ప్రజా చైతన్యం ఎక్కువగా కనిపిస్తుంటుందిక్కడ. కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ, విద్యార్థినులకు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజుల మేర మెటర్నిటీ సెలవులు ఇస్తామని సదరు యూనివర్సిటీ పేర్కొంది.
పెళ్ళి, పిల్లలు తదితర బాధ్యతలు నిర్వహిస్తూ చదువుకోవాలనుకునేవారికి ఈ మాతృత్వ సెలవులు ఎంతగానో ఉపయోగపడతాయని సదరు యూనివర్సిటీ వెల్లడించింది.
మంచి ఆలోచన కదా ఇది.! మిగతా రాష్ట్రాల్లోని కూడా ఈ తరహా ప్రతిపాదనలు తెరపైకి వస్తాయని ఆశిద్దాం.
0 Comments:
Post a Comment