Marrige - ఆ దేశంలో పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ పరీక్ష పాస్ అవ్వాల్సిందే..!
మన దేశంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి వారి కుటుంబ సభ్యుల అంగీకారం ఉంటే చాలు. అదే ప్రేమ వివాహమైతే అది కూడా అవసరం లేదు. కానీ ఓ దేశంలో అలా కాదు. యువతీ, యువకులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ అక్కడి నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు.
ఇండోనేషియా ప్రభుత్వం ఓ నిబంధనను అమల్లోకి తెచ్చింది. వివాహానికి ముందు కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ పొందాలి. ఈ సర్టిఫికెట్ పొందకుండా వివాహం చేసుకుంటే వాళ్లు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా గుర్తించబడతారు. అయితే ఆ సర్టిఫికెట్ ను ఊరికే ఏం ఇవ్వట్లేదు. .
మూడు నెలలు కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే సర్టిఫికేట్ ను ఇచ్చేలా నిబంధనలు పెట్టారు.
ఈ కోర్సులో ఏమేం నేర్పిస్తారంటే..? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, పెళ్లి చేసుకుంటే బాధ్యతగా వ్యవహరించడం, భార్యను, పిల్లలను పోషించడం, కొన్ని ఆ దేశపు చట్టాలు వంటి విషయాలని బోధిస్తారు.
"నైతిక విలువలు, సమాజంలో పేరెంట్స్ పాత్ర" వంటి విషయాలూ నేర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వమే ఓ పరీక్ష నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో పాసయితేనే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వం దృష్టిలో పెళ్లికి అనర్హులుగా గుర్తిస్తుంది. అయితే ఇండోనేషియాలో ఈ నిబంధనను పూర్తిస్థాయిలో అధికారికంగా అమల్లోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. భవిష్యత్ లో ఈ పద్ధతిని ఇండియాలో కూడా అమలు చేయాలని కొందరు నెటిజన్లు. కోరుతున్నారు.
0 Comments:
Post a Comment