Loneliness: మనలో చాలా మందికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. కొందరికైతే పిచ్చి లేస్తుంది. ఒంటరి తనం అలవాటు ఉన్న వారికే అది సాధ్యమవుతుంది.
కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలపై శ్రద్ధ చూపొచ్చు. ఎన్నో పనులు చేసుకోవచ్చు. పెండింగు పనులు పూర్తి చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నాం ఏం తోచడం లేదు అనే వాదనను పక్కన పెట్టండి.
ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు మనల్ని వేధిస్తుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు నచ్చిన ఎన్నో పనులు చేసుకుని ఒంటరి తనాన్ని దూరం చేసుకోవచ్చని తెలుసుకోవాలి.
Loneliness
ఒంటరిగా ఉన్నప్పుడు కాసేపు నడవండి. అది కూడా కొత్త ప్రదేశాలకు ఎంచుకోవడం మంచిది. ఇంకా వంట నేర్చుకుని కొత్త కొత్త వంటలు ప్రయత్నిస్తే కూడా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే మనకు ఒంటరి తనం అనేది గుర్తుకు రాదు. మనం చేసే పనిలోనే సమయం గడిచిపోతుంది. అదే ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉంటే మాత్రం అదే బాధిస్తుంది.
వెరైటీ వంటకాలు చేస్తూ ఉంటే వాటి రుచి కూడా మనకు తెలిసిపోతుంది. పనులు చేయడం మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది.
పూర్వం రోజుల్లో ఆత్మీయులకు అందంగా ఉత్తరాలు రాసుకునే వారు. దీంతో ఎంతో సమయం దాని కోసం కేటాయించేవారు. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేది. ప్రస్తుతం వాటి కాలం దాదాపు అంతరించింది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన చేత్తో ఏదో ఓ ఉత్తరం రాస్తే బాగుంటుంది.
దీంతో మన మెదడుకు పని చెప్పినట్లు అవుతుంది. ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రాదు. ఏం తోచకపోతే నెలవారి పద్దులు రాసుకోండి. నెలకు ఎంత ఖర్చవుతుందనే దానిపై ఓ ప్రణాళిక వేసుకోవాలి. దీంతో సమయం ఆదా అవుతుంది.
Loneliness
మన లక్ష్యాలను ఓ సారి బేరీజు వేసుకోండి. జీవితంలో మనం ఏం సాధించాలి. దాని కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఏ విధంగా కష్టపడితే మన గమ్యం చేరుతాం. విజయం సాధిస్తే మనకు వచ్చే ప్రశంసలను గుర్తు చేసుకుంటే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలపై దృష్టి సారించుకోవచ్చు. ఇంకా ఇంటిని శుభ్రం చేయండి. మంచి సంగీతం వింటే కూడా మనసు ఎంతో తృప్తిగా మారుతుంది.
పుస్తకం చదవడం కూడా మంచి అలవాటే. పుస్తక పఠనం చేస్తే మనకు సమయం విలువ తెలియకుండాపోతుంది. పుస్తకంలో లీనమై మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పనులు చేసి దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
0 Comments:
Post a Comment