LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీలో ఒక ప్రీమియం చెల్లిస్తే చాలు... కోటి రూపాయల వరకు బెనిఫిట్...
1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కస్టమర్ల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు కొత్తకొత్త పాలసీలను ప్రకటిస్తోంది.
2. పాలసీహోల్డర్లకు రక్షణతో పాటు సేవింగ్స్ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పాలసీ. అంతేకాదు, మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది. ఈ పాలసీలో పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్ రెండు ఆప్షన్స్‌తో లభిస్తుంది. టర్మ్ కూడా వేర్వేరుగా ఉంటుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 3 ఏళ్లు కాగా, 10 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 10 ఏళ్లు. కనీస మెచ్యూరిటీ వయస్సు 18 ఏళ్లు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ప్రీమియం ఒకసారి చెల్లిస్తే చాలు. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ ఎంచుకుంటే బెనిఫిట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో ఆప్షన్ 1 ఎంచుకొని ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్ తీసుకున్నారనుకుందాం. సింగిల్ ప్రీమియం జీఎస్‌టీతో కలిపి రూ.9,26,654 చెల్లించాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ రూ.11,08,438 లభిస్తుంది. బెనిఫిట్స్ విషయానికి వస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.21,25,000 బెనిఫిట్ లభిస్తుంది. గ్యారెంటీడ్ అడిషన్స్‌తో డెత్ బెనిఫిట్ రూ.22 లక్షల వరకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో ఆప్షన్ 2 ఎంచుకొని ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్ తీసుకున్నారనుకుందాం. సింగిల్ ప్రీమియం జీఎస్‌టీతో కలిపి రూ.8,34,652 చెల్లించాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ రూ.79,87,000 లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. బెనిఫిట్స్ విషయానికి వస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.16,00,000 బెనిఫిట్ లభిస్తుంది. గ్యారెంటీడ్ అడిషన్స్‌తో డెత్ బెనిఫిట్ రూ.85 లక్షల వరకు లభిస్తుంది. ఒకవేళ బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.12 లక్షలతో తీసుకుంటే రూ.1 కోటి వరకు బెనిఫిట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఈ పాలసీని ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర, ఎల్ఐసీ కార్యాలయాల్లో తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ పాలసీ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment