LIC News: కస్టమర్లకు షాకిచ్చిన ఎల్ఐసీ.. నిన్నటి నుంటే కొత్త నిర్ణయం అమలులోకి..!
LIC News: దేశంలో వడ్డీ రేట్ల పెంపు విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. దీంతో రుణాలు తీసుకున్న చాలా మందికి చుక్కులు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ యూనిట్ LIC HFL సైతం తన వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. దీంతో ఇంటి రుణాల కష్టమర్లపై మరింత భారం పడనుంది.
మారిన రేట్లు..
తాజాగా LIC హౌసింగ్ ఫైనాన్స్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును సవరించింది. పెరిగిన తాజా వడ్డీ రేట్లు డిసెంబర్ 26, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఎల్ఐసీ తన వడ్డీ రేట్లను దాదాపుగా 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో కొత్తగా లోన్ తీసుకునేవారికి ఇకపై రుణం 8.65 శాతం రేటుకు లభించనుంది. కంపెనీ వెబ్‌సైట్ లోని వివరాల ప్రకారం LIC హౌసింగ్ యొక్క సవరించిన ప్రైమ్ లెండింగ్ రేటు(LHPLR) 16.45%గా ఉంది.
వివిధ కస్టమర్లకు రేట్లు ఇలా..
శాలరీడ్ ఎంప్లాయిస్, వృత్తిపరమైన రుణగ్రహీతలకు వడ్డీ రేటు 8.30 శాతం నుంచి ప్రారంభమౌతుందని కంపెనీ వెల్లడించింది. క్రెడిట్ స్కోర్ 800 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న వినియోగదారులకు గరిష్ఠంగా రూ.15 కోట్ల వరకు రుణాన్ని అందించనుంది. అలాగే 750-799 పాయింట్ల వరకు క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి 8.40-8.60 శాతం వడ్డీ రేటుకు గరిష్ఠంగా రూ.5-15 కోట్ల మధ్య రుణాన్ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. ఇక చివరగా 700-749 పాయింట్ల స్కోర్ ఉన్న కస్టమర్లకు 8.70-8.90 శాతం వడ్డీకి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు లోన్ ఆఫర్ చేస్తోంది.
ఆస్తి విలువకు లోన్..
* రూ.30 లక్షల వరకు రుణం కోసం ఆస్తి విలువలో 90%
* రూ.30-75 లక్షల వరకు రుణం కోసం ఆస్తి విలువలో 80%
* రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణం కోసం ఆస్తి విలువలో 75%
* శాలరీడ్ ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల కాలపరిమితితో కంపెనీ రుణాలను ఆఫర్ చేస్తోంది
* స్వయం ఉపాధిపై ఆధారపడే కస్టమర్లకు గరిష్ఠంగా 25 ఏళ్ల కాలానికి హౌసింగ్ లోన్ అందిస్తోంది
LIC HFL అందిస్తున్న హోమ్ లోన్ రకాలు..
నివాసానికి ఇల్లు నిర్మించుకోవటానికి లోన్
NRI కస్టమర్లకు హోమ్ లోన్
ప్లాట్లపై రుణాలు
ఇంటికి మెరుగులు దిద్దుకునేందుకు లోన్
హౌస్ రెన్నోవేషన్ కోసం లోన్
టాప్ అప్ లోన్
బ్యాలెన్స్ ట్రాన్ఫర్ లోన్స్
0 Comments:
Post a Comment