LIC Alert: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు అలర్ట్... ఆ ఛార్జీలు లేవు..
1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీహోల్డర్లకు హెచ్చరిక జారీ చేసింది.
నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్‌డేట్ చేయకపోతే పెనాల్టీ ఉంటుందని సోషల్ మీడియాలో (Social Media) సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని ఎల్ఐసీ ఖండించింది. పాలసీహోల్డర్స్ కేవైసీ డీటెయిల్స్ అప్‌డేట్ చేయకపోతే ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు ఉండవని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి ప్రచారాన్ని పాలసీదారులు నమ్మకూడదని హెచ్చరిస్తోంది. పాలసీహోల్డర్స్ ఎవరికీ తమ వ్యక్తిగత వివరాలు షేర్ చేయకూడదని, డాక్యుమెంట్స్ ఇవ్వకూడదని ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పాలసీహోల్డర్స్ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసేలా తాము నిరంతరం ప్రోత్సహిస్తున్నామని, కానీ కేవైసీ డీటెయిల్స్ అప్‌డేట్ చేయకపోతే ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు ఉండవని ఎల్ఐసీ క్లారిటీ ఇచ్చింది. పాలసీహోల్డర్స్ అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే తమ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని కోరుతోంది ఎల్ఐసీ. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ పాలసీహోల్డర్స్ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. వివరాల కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ చూడాలని, లేదా 022 68276827 నెంబర్‌కు కాల్ చేయాలని ఎల్ఐసీ సూచిస్తోంది. ఎల్ఐసీ అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో కావాలని తెలిపింది. ఏవైనా సందేహాలు ఉంటే ఎల్ఐసీ ఏజెంట్‌ను లేదా దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులో సంప్రదించాలని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఇటీవల ఎల్ఐసీ తొలిసారిగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. ఎల్ఐసీ పాలసీదారులు కంపెనీ అందిస్తున్న సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు. ఇందుకోసం 8976862090 మొబైల్ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే చాలు. ప్రస్తుతం ఓ 10 సేవల్ని మాత్రమే వాట్సప్ ద్వారా అందిస్తోంది ఎల్ఐసీ. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రీమియం డ్యూ, బోనస్ సమాచారం, పాలసీ స్టేటస్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్, రుణ వడ్డీ బకాయి, ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్, ULIP - యూనిట్స్ స్టేట్‌మెంట్, LIC సేవల లింక్స్, సేవలను ప్రారంభించడం, నిలిపివేడయం లాంటి సేవల్ని వాట్సప్‍లో పొందొచ్చు. ఈ సేవలు పొందడానికి పాలసీహోల్డర్స్ ముందుగా తమ ఎల్ఐసీ పాలసీలను ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముందుగా www.licindia.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Customer Portal ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. New user పైన క్లిక్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ యూజర్ ఐడీ జనరేట్ అయిన తర్వాత లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక Basic Services లో Add Policy పైన క్లిక్ చేయాలి. ఇలా మీ ఎల్ఐసీ పాలసీలన్నీ యాడ్ చేయాలి. ఇలా మీ పాలసీలను యాడ్ చేసిన తర్వాత వాట్సప్ ద్వారా ఎల్ఐసీ అందిస్తున్న సేవల్ని పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment