బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు రాసిన సెలవు చీటీ (లీవ్ లెటర్)లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఆ వివరాలు.. బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు..'మా అమ్మ ఈ నెల 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు.
అంత్యక్రియల కోసం.. 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి' అని తన పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగు రోజుల తర్వాత నాకు ఆరోగ్యం పాడవుతుంది
బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్.. త్వరలో తనకు ఆరోగ్యం పాడవ్వనుందని.. అందుకే ఈ నెల 4, 5 తేదీల్లో తనకు సెలవు ఇవ్వండి' అని లేఖ రాశారు.
పెళ్లిలో బాగా తింటా.. కడుపు నొప్పి వస్తుంది..
కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు క్యాజువల్ లీవ్ కోసం..'నేను పెళ్లికి వెళ్లాలి.. అక్కడ భోజనం బాగా చేస్తాను. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
అందుకు ఈ నెల 7న లీవ్ మంజూరు చేయండి'అని కోరారు.
ఇలాంటి వింత లీవ్ లెటర్లు రావడానికి సెలవు తీసుకోవడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ భాగల్పుర్ కమిషనర్ దయానిధన్ పాండే చేసిన ఉత్తర్వులే కారణమని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment