కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఖాళీల భర్తీకి ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంగతన్ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది.
ఇదిలా ఉండగా.. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్లను కేంద్రీయ విద్యాలయ సంగతన్ అందుబాటులోకి తెచ్చింది. కేవీల్లో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు రూల్ నెంబర్; పాస్వర్డ్ వివరాలు నమోదుచేసి మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాక్ టెస్టులో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
నోటిఫికేషన్లో ప్రకటించిన ప్రకారమే పరీక్ష విధానం, సిలబస్ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు. మాక్ టెస్టు రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. ప్రధాన పరీక్షకు హాజరయ్యే ముందు అభ్యర్థులు ఈ మాక్ టెస్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అభ్యర్థుల్లో ఉండే భయాన్ని దూరంచేసి వారిని పరీక్షకు సన్నద్దమయ్యేలా దోహదపడుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ అభ్యర్థి ఈ మాక్ పరీక్ష రాయడం మంచిది.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
0 Comments:
Post a Comment