Kongara Jaggaiah - లోకసభలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ నటుడు ఎవరంటే..?
ప్రముఖ చలనచిత్ర నటుడు జగ్గయ్య గురించి ప్రత్యేకంగా మనం పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన 1967 లో ఒంగోలు నియోజక వర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత లోకసభలో అడుగుపెట్టారు. ఇక భారత దేశంలో ఈ ఘనత సాధించిన తొలి సినీ నటుడిగా జగ్గయ్య రికార్డులోకి ఎక్కడం గమనార్హం.
మొదటిసారి లోకసభలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు జగ్గయ్య..
ముఖానికి రంగులు వేసుకొని.. రాజకీయాలకు పనికి రారని అన్నవారి చేత శభాష్ అనిపించుకున్నారు. నిజానికి కొంగర జగ్గయ్య గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. విద్యార్థి దశనుంచే రాజకీయాలలో కీలకపాత్ర పోషించారు. అలా కాంగ్రెస్ పార్టీలోనే సోషలిస్టు గ్రూపు రద్దయిన తర్వాత ప్రజా సోషలిస్టు పార్టీలో చేరి 1956లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలా 1967లో ఒంగోలు నియోజకవర్గం లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొంది లోకసభలో అడుగు పెట్టారు.
నిజానికి లోకసభలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు అలాగే తెలుగువాడు కావడం విశేషం. కొంగర జగ్గయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, అందంతో ప్రేక్షకులను అలరించిన ఈయన హీరో గానే కాదు విలన్ గా కూడా నటించి మరింత అద్భుతంగా ప్రేక్షకుల ఆదరణ పొందారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన రాజకీయాలలో కూడా తన వంతు కృషి చేశారు. తన పట్టుదలతో నిక్కచ్చితమైన మాటలతో రాజకీయ నాయకులకు కూడా ముచ్చెమటలు పట్టించారు.
ఇకపోతే ఈయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలామంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతేకాదు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో రాణించిన వారు కూడా చాలామంది ఉన్నారు ..ముఖ్యంగా ఎన్టీఆర్ ను మొదులుకొని నేటితరం ఆయన వారసుల వరకు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కొనసాగుతూనే, రాజకీయాలలో కూడా తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
0 Comments:
Post a Comment