Keera Dosa Juice - ఈ ఒక్క జ్యూస్ డైట్ లో ఉంటే ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా మారతారు!
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ క్యాలరీలను కరిగిస్తున్నారు.
అయితే బరువు తగ్గడానికి కొన్ని కొన్ని ఆహారాలు కూడా ఎంతగానో సహాయపడుతుంటాయి. అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఒకటి. ఈ ఒక్క జ్యూస్ డైట్ లో ఉంటే చాలు ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా మారతారు. పైగా ఆరోగ్యానికి సైతం ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి..? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కీర దోసకాయను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరియు ఒక టమాటో ను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిత్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి. ఈ కీర క్యారెట్ టమాటో జ్యూస్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా మారతారు. వేగంగా బరువు తగ్గడానికి ఈ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. మరియు చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ జ్యూస్ లో డైట్ లో చేర్చుకోవచ్చు.
0 Comments:
Post a Comment