Kaikala Satyanarayana: నాలుగుతరాల నటులతో నటించిన నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(Tollywood senior actor Kaikala Satyanarayana) (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని(Filmnagar) తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
దీంతో టాలీవుడ్లో తీవ్రవిషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా(Krishna District) గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు.
కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
సినీ నీలోకంలో మరో విషాదం నెలకొంది. దిగ్గజనటుడు కైకాల సత్యనారాయణ మరణం టాలీవుడ్ ను విషాదంలో ముంచేసింది.
వందలాది ల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల సత్యనారాయణ. వయోభారంతో గతకొంతకాలంగా లకు దూరంగా ఉంటున్నారు కైకాల సత్యనారాయణ. సుమారు 777 సినిమాల్లో
మెప్పించారు ఆయన. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల నేడు తెల్లవారు జామున కన్నుమూశారు. కైకాల సత్యనారాయణ పార్థివదేహాన్ని కైకాల సత్యనారాయణ ఇంటికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు కైకాల భౌతికదేహాన్ని దర్శించుకుంటున్నారు. రేపు (24న) హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. ఇక ఇండస్ట్రీలో అజాత శత్రువులా జీవితాన్ని గడిపారు కైకాల. 60ఏళ్ళు సినీ జీవితాన్ని అందుభావించారు కైకాల. ఆరు దశాబ్దాల సినీ జీవితంలో నాలుగు తరాల నటీనటులతో నటించారు.
సినీ కెరీర్ లో ఎన్నో మలుపులు చూసారు. ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, అభిమానం చూరగొన్నారు. పౌరాణికం, జానపదం, సాంస్కృతికం, చారిత్రకం.. ఇలా ఏ జోన్ లో అయినా నటించగల సత్తా కైకాల సత్యనారాయణది. కెరీర్ మొదట్లో ఆయన ఎన్టీఆర్ కు డూప్ గా కూడా చేసారు.
ఇక నాలుగు తరాల నటులతో నటించారు కైకాల.. ముఖ్యంగా నందమూరి తారక రామారావు ఫ్యామిలీ తో కైకాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. రామారావుతో, బాలకృష్ణ తో , ఎన్టీఆర్ తో ఇలా అందరితో నటించారు. అటు కృష్ణ ఫ్యామిలి సూపర్ స్టార్ కృష్ణతో పాటు మహేష్ బాబుతో కూడా కలిసి నటించారు.అలాగే చిరంజీవితో సత్యనారాయణకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటీవల కాలంలో చిరంజీవి సత్యనారాయణ పుట్టిన రోజున కూడా ఆయనను కలిశారు. కైకాల సత్యనారాయణకు 2011 లో రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. కైకాల చివరిగా మహేష్ బాబు నటించిన మహర్షి లో చిన్న పాత్రలో కనిపించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది ఒకరు ఎస్వీ రంగారావు అయితే మరొకరు నిస్సందేహంగా కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన లు అక్షరాలా వంద. క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిద్దరిదే.
0 Comments:
Post a Comment