Jio Celebration Offer: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.8తో 2.5 జీబీ డేటా, ఫ్రీ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లు!
Reliance Jio | మీరు రిలయన్స్ జియో సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే శుభవార్త. మీకోసం దేశీ అతిపెద్ద టెలికం కంపెనీగా కొనసాగుతూ వస్తున్న రిలయన్స్ జియో (Jio) సూపర్ రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంచింది.
జియో సెలబ్రేషన్ ఆఫర్లో భాగంగా మీరు ఈ ప్లాన్ పొందొచ్చు. యూజర్లు ఈ రీచార్జ్ ప్లాన్‌తో (Jio Plans) పలు రకాల ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాదంతా బెనిఫిట్స్ పొందొచ్చు. కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ఇలా అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
రిలయన్స్ జియో సెలబ్రేషన్ ఆఫర్ కింద యూజర్లు రూ. 2,999తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 100 శాతం వాల్యూ బ్యాక్ ప్లాన్. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. రోజూవారీ డేటా పొందొచ్చు. ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. అందువల్ల ప్రతిసారి రీచార్జ్ చేసుకోవడం కష్టంగా భావించే వారు ఈ ఏడాది వాలిడిటీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
రూ. 2999 ప్లాన్‌తో ప్రతి రోజూ 2.5 జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 365 రోజులు. అపరిమిత కాలింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు పంపొచ్చు. అంటే మొత్తంగా ఈ ప్లాన్ కింద యూజర్లకు 912.5 జీబీ డేటా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్లాన్ వాలిడిటీ 365 రోజుల ప్రకారం చూస్తే.. రోజుకు కేవలం రూ.8.27 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ బెనిఫిట్స్ అన్ని లభిస్తాయని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా కాంప్లిమెంటరీ సర్వీసులు కూడా పొందొచ్చు. జియో యాప్స్ యాక్సెస్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. డెయిలీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అలాగే మీరు జియో 5జీ సర్వీసులకు అర్హత కలిగి ఉంటే మీరు అపరిమిత 5జీ డేటా పొందొచ్చు.
ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ. 299 విలువైన రెండు మిని మ్యాగ్నెట్స్ ఉచితంగా పొందొచ్చు జూమిన్ నుంచి ఇవి లభిస్తాయి. అలాగే రూ. 1000 వరకు విలువైన వివిధ రకాల వోచర్లు పొందొచ్చు. వీటిల్లో ఫెర్న్స్ అండ్ పెటల్స్, ఇక్సిగో, అజియో, రిలయన్స్ డిజిటల్ వంటి కూపన్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి అదనపు డేటా బెనిఫిట్ కూడా లభిస్తోంది. అదనంగా 75 జీబీ డేటా సొంతం చేసుకోవచ్చు. ఇలా ఈ ఏడాది ప్లాన్‌తో పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
0 Comments:
Post a Comment