ISRO Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఇస్రోలో భారీగా 526 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే...
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో).. 526 అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లో 54 ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు కనీసం ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 9, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు (డిసెంబర్ 20) నుంచి ప్రారంభమవుతాయి.
దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అహ్మదాబాద్: 31
బెంగళూరు: 215
హసన్: 17
హైదరాబాద్: 54
న్యూదిల్లీ: 02
శ్రీహరికోట: 78
తిరువనంతపురం: 129
0 Comments:
Post a Comment