వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 9 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి.
ఐతే ఇందులో ఆరు మన ఇండియావే ఉన్నాయి. అందులోనూ మూడు డబుల్ సెంచరీలు ఒక్క రోహిత్ శర్మే సాధించాడు.
1. రోహిత్ శర్మ: వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014లో శ్రీలంక జట్టుపై 173 బంతుల్లో 264 స్కోర్ చేశాడు.
2. మార్టిన్ గప్తిల్: న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ 2015లో వెస్టిండీస్ జట్టుపై 149 బంతుల్లో 237 పరుగులు చేశాడు.
3. వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా సెన్షేషన్ సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్ జట్టుపై 149 బంతుల్లో 219 రన్స్ సాధించాడు.
4. క్రిస్ గేల్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాటర్ గేల్ 2015లో జింబాబ్వే జట్టుపై 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు.
5. ఫఖర్ జమాన్: పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ 2018లో జింబాబ్వే జట్టుపై 156 బంతుల్లో 210 పరుగులు సాధించాడు.
6. ఇషాన్ కిషన్: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్.. నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై 131 బంతుల్లోనే 210 రన్స్ చేశాడు.
7. రోహిత్ శర్మ: ఇండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. 2013లో ఆస్ట్రేలియా టీమ్‌పై 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు.
8. రోహిత్ శర్మ: 2017లో కూడా రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంక జట్టుపై 153 బంతుల్లో 208 స్కోర్ చేశాడు.
9. సచిన్ టెండూల్కర్: వన్డేల్లో మొట్ట మొదటి డబుల్ సెంచరీ చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. 2010లో సౌతాఫ్రికాపై 147 బంతుల్లో 200 రన్స్ కొట్టాడు.
0 Comments:
Post a Comment