Inspiration కుంకుమ పువ్వు సాగుతో లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగులు సొంతంగా బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు ఉద్యోగులు వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అంతేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వ్యవసాయాన్ని సులభమైన పద్ధతులతో చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు వ్యవసాయంలోకి దిగి.. లక్షల్లో సంపాదించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే వారి వారి ఆలోచనకు తగ్గినట్లు వివిధ రకాల పంటలపై ఆసక్తి చూపిస్తుంటారు. వరి, కూరగాయలు, దాన్నిమ్మ స్టాబెర్రి వంటి వివిధ రకాల పంటలను సాగు చేస్తూ చాలా మంది ఉద్యోగులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. అలానే తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైటెక్ టెక్నాలజీతో కుంకుమ పువ్వును సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. మరి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కాశ్మీర్ కుంకుమ పువ్వు ఒకటి. దీనికి మార్కెట్ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈ కుంకుమ పువ్వును సాగు చేయాలంటే చాలా ఓపిక, శ్రద్ధ ఉండాలి. అయితే కుంకుమ పువ్వు అంటే ఠక్కున జమ్ముకాశ్మీర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పంట సాగను కశ్మీర్ లోయ ప్రాంతాల్లో ఉండే రైతులు మాత్రమే చేసేవారు. కానీ కాలం మారి.. సాంకేతికంగా అభివృద్ధి చెందడంతో ఈ కుంకుమ పువ్వు సాగు అనేది మధ్య భారతదేశంలోకి విస్తరించింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ శైలేష్ మోదక్ రైతుగా మారి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. కేవలం 160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కుంకుమ పువ్వు పంటను పండిస్తున్నాడు. హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి.. అతి తక్కువ ప్రాంతంలోనే కుంకుమ పువ్వును ఉత్పత్తి చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.
అయితే ఈ కశ్మీర్ కుంకుమ పువ్వు సాగుపై శైలేష్ పలు విషయాలు వెల్లడించాడు. ఈ పంటను సాగు చేసేందుకు మొదట రూ.10వేలు పెట్టుబడి పెట్టానని తెలిపారు. అంతేకాక ఈ కుంకుమ పువ్వు సాగు కోసం కాశ్మీర్ నుంచి విత్తనాలు తెప్పించానని, దీని కోసం ఏరోఫోనిక్ అనే సాంకేతికత ను ఉపయోగిస్తున్నానని చెప్పారు. కేవలం 160 చదరపు అడుగుల విస్తీర్ణమున్న కంటైనర్ లోనే ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నట్లు తెలిపారు. కుంకుమ పువ్వు సాగు కోసం వాతావరణానికి అనుగుణంగా సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు. అలా తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో శైలేష్ లక్షల్లో సంపాదిస్తున్నాడంట. మరి.. ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేస్తున్న కుంకుమ పువ్వు సాగుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
0 Comments:
Post a Comment