Indian Navy Jobs: పది, ఐటీఐ చేసిన వారికి బంపర్ ఆఫర్.. నేవీలో ఉద్యోగాలు..!
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 అప్రెంటీస్ పోస్టులని భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కానీ అప్లై దరఖాస్తు ఫారమ్‌ను పోస్ట్ ద్వారా ఇండియన్ నేవీకి పంపాలి. అభ్యర్థులు అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్- apprenticeshipindia.gov.inని సందర్శిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్లై చేసుకోవడానికి 02 జనవరి 2023 వరకు సమయం ఉంది.
ఇలా అప్లై చేయండి..
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్- apprenticeshipindia.gov.inకి వెళ్లండి.
2. హోమ్ పేజీలో Find an Apprenticeship Opportunity లింక్‌పై క్లిక్ చేయండి.
3. తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌కి వెళ్లండి.
4. తదుపరి పేజీలోని లింక్‌పై క్లిక్ చేయండి.
5. తదుపరి పేజీలో అడిగిన వివరాలను నమోదు చేసుకోండి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
7. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫారమ్‌ను ఆఫీసర్-ఇన్-చార్జ్ (అప్రెంటిస్‌షిప్), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, VM నావల్ బేస్ SO, PO-విశాఖపట్నం-530 014, ఆంధ్రప్రదేశ్‌కి పోస్ట్ చేయండి. ఫారమ్‌ను చేరుకోవడానికి చివరి తేదీ జనవరి 9 గుర్తుంచుకోండి.
ఖాళీల వివరాలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 36, ఫిట్టర్ - 33, షీట్ మెటల్ వర్కర్ - 33, వడ్రంగి - 27, డీజిల్ మెకానిక్ - 23, పైప్ ఫిట్టర్ - 23, ఎలక్ట్రీషియన్ - 21, R&A/C మెకానిక్ - 15, గ్యాస్ & ఎలక్ట్రిక్ వెల్డర్ - 15, మెషినిస్ట్ - 12, పెయింటర్ (జనరల్) - 12, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 10, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 10, ఫౌండ్రీమ్యాన్ - 5
ఇండియన్ నేవీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నేవీలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. 10వ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి. ఐటీఐలో కనీసం 65 శాతం మార్కులు కలిగి ఉండాలి.
0 Comments:
Post a Comment