IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో మొదలైన ప్లేస్‌మెంట్స్.. 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ప్యాకేజీ..
IIT Madras: ఇండియాలో చాలా మంది విద్యార్థులకు ఉండే కల ఐఐటీ(IIT). దేశంలోని ఈ ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్లలో సీటు సంపాదించేందుకు సంవత్సరాలపాటు కష్టపడుతుంటారు.
అందుకు కారణం మెరుగైన విద్య, టాప్ కంపెనీలలో ప్లేస్‌మెంట్స్. ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడే క్యాంపస్‌లలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(IIT, Madras) ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ చదివిన చాలా మంది స్టూడెంట్స్ భారీ ప్యాకేజీలతో బడా కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. అయితే ఈ ఏడాదికి 2022-23కి సంబంధించిన ప్లేస్‌మెంట్స్ డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. ఈ వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫేజ్-1లో 331 కంపెనీలు
2022-23 అకడమిక్ ఇయర్లో వివిధ స్ట్రీమ్స్ నుంచి మొత్తంగా 1,722 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. ఫేజ్-1 ప్లేస్‌మెంట్స్ కోసం 331 కంపెనీలు రిజిస్టర్ చేసుకోగా, మొత్తంగా 722 ప్రొఫైల్‌లకు రిక్రూట్మెంట్ జరగనుందని ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
మొదటి రోజే 445 మందికి ప్లేస్‌మెంట్స్
ఈ ఏడాది 25 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా ప్యాకేజీలతో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ప్లేస్మెంట్ మొదటి రోజు 1.1 సెషన్ ముగిసే నాటికి మొత్తంగా 445 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ సాధించారు. అంతేకాకుండా నాలుగు కంపెనీల నుంచి 15 అంతర్జాతీయ ఆఫర్స్ కూడా పొందారు.
ఉద్యోగాలు ఆఫర్ చేసిన కంపెనీలు
ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు ఈ ఏడాది అత్యధిక ఆఫర్లను ఇచ్చిన టాప్ కంపెనీలలో.. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ 14 మందికి, బజాజ్ ఆటో లిమిటెడ్ & చేతక్ టెక్ లిమిటెడ్ 10 మందికి ఆఫర్స్ ఇచ్చింది. క్వాల్కమ్ 8 ఆఫర్స్, JP మోర్గాన్ చేజ్ & కో 9 ఆఫర్స్, Proctor & Gamble 7 ఆఫర్స్ అందజేశాయి. అదే విధంగా మోర్గాన్ స్టాన్లీ ఆరుగురికి, గ్రావిటన్ ఆరుగురికి, మెకిన్సి & కంపెనీ ఐదు మందికి, కోహెసిటీ ఐదు మందికి భారీ ప్యాకేజీతో జాబ్స్ ఆఫర్ చేశాయి.
డిసెంబర్ 7 వరకు ఫేజ్-1
ఫేజ్-1లో రిక్రూట్ చేస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలలో ONGC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) ఉన్నాయి. ప్లేస్‌మెంట్స్ ఫేజ్-1 డిసెంబర్ 7 వరకు కొనసాగుతాయి. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది అత్యధిక ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్స్‌ను కూడా సొంతం చేసుకుంది. గతేడాది కంటే ఇది 10 శాతం ఎక్కువగా ఉంది. గతేడాది 407 ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను దక్కించుకుంది.
ఐఐటీ గౌహతిలో కూడా ప్రారంభం
ఐఐటీ గౌహతి కూడా ప్లేస్‌మెంట్‌ను ప్రారంభించింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, డేటా సైన్స్, క్వాంట్, కోర్ ఇంజనీర్, UX డిజైనర్, VLSI, వెహికల్ ఇంజనీరింగ్, అనలిస్ట్, ప్రోడక్ట్ డిజైనర్ ఉద్యోగ ప్రొఫైల్స్ వంటి వివిధ రంగాల్లో 46 కంపెనీలు మొత్తంగా 168 ఆఫర్స్‌ను అందించాయి. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్, గూగుల్ , ఉబర్, క్వాల్కమ్, సీ-డాట్, ఎన్ఫేస్ ఎనర్జీ, ఒరాకిల్, నుటానిక్స్, స్క్వేర్ పాయింట్ SDE/Quant, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, JP మోర్గాన్ చేజ్, బజాజ్, రిప్లింగ్, టిబ్రా, కోహెసిటీ, స్ప్రింక్లర్ ప్లాట్‌ఫారమ్ + ప్రొడక్ట్ వంటి కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేశాయి.
0 Comments:
Post a Comment