కొన్నిసార్లు నిజజీవితాల్లో జరిగే సంఘటనలు అచ్చంగా లను తలపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది.
ఓ యువతి పొరపాటున బస్సులో పోగోట్టుకున్న పర్సు కారణంగా ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది.
పర్స్ ఏంటి.? అమ్మాయి ప్రాణాలను కాపాడడం ఏంటని.? ఆలోచిస్తున్నారు కదూ.. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఆదివారం రోజు ఓ యువతి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బస్సు ఎక్కి సికింద్రాబాద్ జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులంతా బస్సు దిగిన తర్వాత.. రవీందర్ అనే కండక్టర్‌కు బస్సులో ఓ పర్సు కనిపించింది.
దీంతో ఆ పర్సు ఎవరిదో అని తెలుసుకునే ఉద్దేశంతో కండెక్టర్ పర్సును తెరిచి చూశాడు. అందులో కొంత మొత్తంతో పాటు ఓ లెటర్ కనిపించింది.
ఇంతకీ ఆ లేఖలో ఏముందని చదవగా.. యువతి తనకు పెళ్లి చేసుకోవడం లేదని, చనిపోవాలనుకుంటున్నానిని ఆ లేఖలో రాసి ఉంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన కండక్టర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఆ పర్సులో ఉన్న ఆధార్ కార్డుతో పాటు లెటర్‌ను సజ్జనార్‌కు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు.
ఆర్టీసీ ఎస్సై దయానంద్, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఆ యువతిని గురించి కుటుంబీలకు అప్పగించారు. అనంతరం యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఈ సంఘటన వైరల్ అయ్యింది. నిజంగానే ఈ ఉదంతం ను తలపిస్తోంది కదూ!
0 Comments:
Post a Comment