How To Reduce Cholesterol: రాత్రి వీటిని తినకపోతే చాలు.. బాడీలో చెడు కొలెస్ట్రాల్ వెన్నల కరుగుతుంది.
How To Reduce Cholesterol In 5 Days: శరీరంలో కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో పెరగడం వల్ల తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి.
కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటేనే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాత్రి తిన్న తర్వాత ఎలాంటి శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇలా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా రాత్రి తీసుకుని ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది:
ఫాస్ట్ ఫుడ్స్:
ఫాస్ట్ ఫుడ్స్ గుండెకు చాలా హానికరం. ఇలాంటి ఆహారాలు ప్రతి రోజూ తింటే శరీరంలో సులభంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. కాబట్టి రాత్రి పూట ఆహారంలో పిజ్జా, పాస్తా, బర్గర్లు, నూడుల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకుని ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
జున్ను తినడం:
ప్రస్తుతం జున్నుకు సంబంధించి స్టాల్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటితో తయారు చేసిన ఆహారాలు కూడా మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే తప్పకుండా గుండె పోటు సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని తినకపోవడమే చాలా మంచిది.
రెండ్ మీట్:
రెడ్ మీట్ కూడా శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకునేవారు ఈ రెడ్ మీట్‌ను ప్రతి రోజూ తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నూనె, కారంగా ఉండే ఆహారాలు:
రాత్రి పూట నూనె, కారం ఎక్కువగా ఉండే ఫ్రై చేసిన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో సంతృప్త కొవ్వు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇది సిరలలో ఫలకాన్ని పెంచుతాయి. దీని వల్ల గుండె పోటు సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment