How To Control Fat: రూపాయి ఖర్చు లేకుండా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు..!
Easiest Way To Control Weight: చాలామంది శరీర బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. కఠిన తర్వాత వ్యాయామాలు యోగలను చేస్తూ ఉంటారు.
ఇంకొందరైతే బరువు తగ్గడానికి డైట్లను కూడా అనుసరిస్తారు. అయితే ఇకనుంచి ఇలా చేయనక్కర్లేదు మేము ఈరోజు మీకోసం ఫిట్నెస్ సీక్రెట్ తెలుపబోతున్నాం. దీంతో ఎలాంటి ఖర్చు లేకుండా మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా పడుకొని కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రపోతూ కూడా ఎలా బరువు తగ్గాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు:
సరైన క్రమంలో నిద్రపోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువు తగ్గొచ్చు. చాలామంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల డైట్లను పాటించి లేటుగా నిద్రపోతుంటారు. ఇంకొంతమంది అయితే కేవలం 6 గంటలకంటే తక్కువనే నిద్రపోతారు. ఇలా నిద్రపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీర బరువును తగ్గించుకునే క్రమంలో తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
>బరువు తగ్గే క్రమంలో ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఊబకాయం పొట్ట సమస్యలు సులభంగా తగ్గిపోయి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దీంతో మీరు అనుకున్నంత బరువు సులభంగా తగ్గగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే క్రమంలో 8 గంటలకంటే ఎక్కువగా నిద్ర పోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
>>8గంటలకంటే ఎక్కువగా నిద్రపోతే జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గే క్రమంలో పాటించాల్సి ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు ఇది గుర్తుపెట్టుకోండి:
రాత్రి పడుకునే ముందు డైట్ లో భాగంగానే తక్కువగా ఫుడ్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గి జీర్ణ క్రియ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గిపోతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఇలాంటి ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment