High Cholesterol: చలి కాలంలో గుండె పోటు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మీ దరిదాపుల్లోకి కూడా రాదు...
Cholesterol In Winter: చలికాలంలో చాలా మందిలో గుండె పోటు సమస్యలు వస్తాయి. ఈ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఈ వ్యాధులే కాకుండా చాలా రకాల శరీర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చలి కాలంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
వేయించిన ఆహారాలు:
చలికాలంలో వేడిగా.. కారంగా ఉండే ఆహారాన్ని తినాలని అందరూ అనుకుంటారు. అయితే చాలా మంది కొన్నిసార్లు పకోడీలు, సమోసాలు విచ్చల విడిగా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
తీపి పదార్థాలు:
చలి కాలంలో చాలా మంది తీపి పదార్థాలను కూడా అతిగా తింటారు. అయితే ఇలా తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫీ, టీ, పాయసం, స్వీట్లు వంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి చలి కాలంలో వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
రెడ్ మీట్:
శీతాకాలంలో మాంసాహారాలు విచ్చల విడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రెడ్ మీట్ తో పాటు అల్కాహాల్ అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో తీవ్ర చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల ఉత్పన్నమవుతాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫాస్ట్ ఫుడ్:
ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిని ఇచ్చినా దీనిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే.. అయితే వీటిని అతిగా శీతాకాలంలో తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఫాస్ట్ ఫుడ్ అతిగా తినడం వల్ల రక్త ప్రసరణ కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి.
జున్ను, పనీర్
చీజ్ శరీరానికి చాలా మంచిదైనప్పటికి.. దీనిని శీతాకాలంలో అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలో చీజ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
0 Comments:
Post a Comment